AP Assembly: అధికారుల తీరుపై అసెంబ్లీ లాబీల్లో చర్చ
ABN, Publish Date - Jul 24 , 2024 | 11:10 AM
అధికారుల తీరు మీద అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని అధికారులపై కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు విమర్శలు గుప్పించారని తెలుస్తోంది.
అమరావతి: అధికారుల తీరు మీద అసెంబ్లీ లాబీల్లో చర్చ జరిగింది. మంత్రులను మాయ చేసేలా సమాచారం ఇస్తున్నారని అధికారులపై కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు విమర్శలు గుప్పించారని తెలుస్తోంది. గత ప్రభుత్వానికి సంబంధించి సభ్యులడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం లేదని మంత్రులు అంటున్నారు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులిచ్చిన సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివరాల్లేకుండా అవును.. కాదు.. అనే రీతిలో అధికారులు సమాధానమివ్వడంపై పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని అధికారులను పవన్ నిలదీశారు. అనుబంధ పత్రాల్లో కాకుండా.. సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు పైనా అధికారుల సమాచారంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో ఎంత మాత్రం మళ్లించ లేదని అధికారులు సమాచారమిచ్చారు. అధికారుల సమాచారానికి భిన్నంగా సభలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమాధానం ఇచ్చారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో పూర్తి స్థాయి సమాచారం లేదని ఆయన తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు మంత్రి డోలా ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 24 , 2024 | 11:10 AM