ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాగునీటి సంఘాలన్నీ ఏకగ్రీవం

ABN, Publish Date - Dec 26 , 2024 | 05:06 AM

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. సాగునీటి సంఘాల సమాఖ్యలన్నిటికీ ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.

మొత్తం చుట్టేసిన కూటమి

245 డిస్ర్టిబ్యూటరీ, 18 మేజర్‌,15 మీడియం ప్రాజెక్టు కమిటీలు కైవసం

వైసీపీకి సున్నా.. జగన్‌ అసహనం

నామినేషన్లు వేయనివ్వలేదని ప్రచారం

అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది. సాగునీటి సంఘాల సమాఖ్యలన్నిటికీ ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. 2019-24 మధ్య సాగునీటి ప్రాజెక్టులకు జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిర్వహణకు కూడా పైసా ఇవ్వకుండా మొండిచేయి చూపింది. పైగా సాగునీటి సంఘాల ద్వారా 2014-19 మధ్యకాలంలో నీరు చెట్టుకింద చేపట్టిన పనులకు బిల్లులనూ చెల్లించలేదు. ముఖ్యమంత్రిగా జగన్‌ సాగునీటి సంఘాల పట్ల వ్యవహరించిన తీరుపై రైతులు, రైతు నేతల్లో తీవ్ర ఆగ్రహం గూడుకట్టుకుంది. దీని ఫలితంగానే ఇప్పుడు చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు విజయఢంకా మోగించారు. రాష్ట్రంలోని మేజర్‌ ప్రాజెక్టుల పరిధిలోని 21,060, మీడియం ప్రాజెక్టుల పరిధిలో 3,192, మైనర్‌ ఇరిగేషన్‌ పరిధిలోని 21,768.. మొత్తంగా 49,020 టెరిటోరియల్‌ కమిటీలకు జరిగిన ఎన్నికలు వాటికి ఏకపక్షమయ్యాయి. అదేవిధంగా మేజర్‌ ప్రాజెక్టుల వరిధిలోని 245 డిస్ర్టిబ్యూటరీ కమిటీలు, 18 మేజర్‌ ప్రాజెక్టు కమిటీలు, మీడియం ప్రాజెక్టుల పరిధిలోని 15 కమిటీలు కూటమి వశమయ్యాయి. వైసీపీకి ఒక్కటి కూడా దక్కలేదు. చివరకు జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల సహా... కడవ జిల్లాలోనూ సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీకి వైసీపీ నాయకులెవరూ ముందుకు రాలేదు. తమ నామినేషన్లను సాంకేతిక కారణాలను చూపి తిరస్కరించారంటూ కొందరు నేతలు ఆరోపణలు చేస్తున్నా.. వాస్తవానికి చాలా మంది కావాలనే నామినేషన్లలో పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదని తెలుస్తోంది.


సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను పులివెందుల సహా 11 స్థానాలకే వైసీపీ పరిమితం కావడంతో ఆ పార్టీ నేతలు, శ్రేణులు పరాజయ భారం నుంచి ఇప్పటికీ బయటపడలేదు. అందుకే నీటి సంఘాల ఎన్నికలపై ఆసక్తి చూపలేదు. దీనిని మరుగుపరచి.. తమ వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని జగన్‌ ప్రచారం చేస్తున్నారు. అయితే సాగునీటి ఎన్నికల్లో ఎంతమంది వైసీపీ నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్థపడ్డారో ఆయన వెల్లడించాలని కూటమి పార్టీలు సవాల్‌ విసురుతున్నాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను నామినేషన్లు వేయనివ్వకపోవడం, వేసినా దొంగ సంతకాలతో ఉపసంహరణలు, అపహరణలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో వాటిని కైవసం చేసుకున్న సంగతి గుర్తుచేస్తున్నాయి. కాగా.. ఎన్నికలు ఏకగ్రీవంగా ముగియడంతో ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణపై కమిటీలు దృష్టి సారించాయి ప్రధానమైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌, ధవళేశ్వరం వంటి మేజర్‌ ప్రాజెక్టులతో పాటు మధ్యతరహా చిన్నతరహా నీటి వనరుల అభివృద్థి పనులు వేగం పుంజుకోనున్నాయి.

Updated Date - Dec 26 , 2024 | 05:06 AM