ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Destruction : కొప్పర్తి కోసం పైపులైన్లు ధ్వంసం

ABN, Publish Date - Sep 12 , 2024 | 11:19 PM

కొప్పర్తి మెగా ఇండస్ట్రి యల్‌ పార్కుకు తాగునీటిని తీసుకువెళ్లే పైపులైను ఏర్పాటులో శేషయ్యగారిపల్లెకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పండగ పూటకూడా తాగునీటి కోసం బిందెలతో పరుగులెత్తాల్సి వచ్చింది.

శేషయ్యగారిపల్లె వద్ద జరుగుతున్న ఏపీఐఐసీ పైపులైను పనులు

పనులను అడ్డుకున్న గ్రామస్తులు

ఆగ్రహించిన శేషయ్యగారిపల్లె ప్రజలు

ట్యాంకరుతో నీటిని సరఫరా చేసిన కాంట్రాక్టర్లు

తాగునీటి పైప్‌లైన్‌ వేయాలని వేడుకోలు

చెన్నూరు, సెప్టెంబరు 12: కొప్పర్తి మెగా ఇండస్ట్రి యల్‌ పార్కుకు తాగునీటిని తీసుకువెళ్లే పైపులైను ఏర్పాటులో శేషయ్యగారిపల్లెకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పండగ పూటకూడా తాగునీటి కోసం బిందెలతో పరుగులెత్తాల్సి వచ్చింది. గ్రామస్తు లు ఆగ్రహించడంతో చివరకు కాంట్రాక్టరే ట్యాంకర్‌ తో నీటిని సరఫరా చేశారు. పైపులైను కొత్తగా వే సేందుకు ఎక్సకవేటర్‌తో గుంతలు తీస్తూ పాత పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడంతోనే ఈ సమస్యలు మొదలయ్యాయని గ్రామస్తులు వివరిస్తున్నారు.

కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్‌ పార్కుకు తాగునీటిని తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో నిర్వ హించిన టెండర్లలో పెన్నానది నుంచి పైపులైను పనులు మొదలు పెట్టారు. ఈ నేప ధ్యంలో కొద్దిరోజులుగా పైపులైను వేసేందుకు ఎక్సకవేటర్‌తో చిన్నమాచు పల్లె నుంచి శేషయ్యగారి పల్లె మీదుగా పనులు మొ దలు పెట్టారు. గతంలో శేష య్యగారిపల్లెకు వేసిన పైపులైను కొత్తగా వేసేందుకు ఎక్సకవేటర్‌తో గుంతలు తీస్తూ పాతవాటిని ధ్వంసం చేశా రు. ఫలితంగా నాలుగు రోజులుగా శేషయ్యగారపల్లె ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రా మానికి ఎప్పుడో ఏర్పాటు చేసిన పైపులైన్‌ను ఏపీ ఐఐసీ పుణ్యమా అంటూ ధ్వంసం చేశారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గురు వారం శేషయ్యగారిపల్లె వద్ద జరుగుతున్న పైపు లైను పనులను ప్రజలు అడ్డుకు న్నా రు. పైగా నాలుగురోజులుగా వీరి నిర్వాకంతో తాగునీటి కష్టాలు మొదల య్యాయని వాపోయా రు.


పైపులు పగలడంతో మురికిగా మారిన నీరు

గతంలో ఉన్న పైపులైను పాడు చేసి మాకు తాగునీరు లేకుండా చేస్తారా అంటూ పైపులైను పనులు చేసే వ్యక్తి తో వాగ్వాదానికి దిగారు. గ్రా మస్తులు తిరగబడడంతో ఎక్సక వేటర్‌తో పైపులైను పనులు చేసే వ్యక్తి విషయం వారి మేనేజరుకు తెల పడంతో వారు ఓ ట్యాంకరుతో నీళ్లు తెచ్చి ప్రజలకు అందించారు. నాలుగు రోజులుగా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పుడేమో ఒక ట్యాంకరుతో నీళ్లు తెచ్చిస్తే మాకు సరిపోతాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు కొత్త పైపు లైను ఏర్పాటు చేయాలని లేదంటే ఒప్పుకునేదిలేద న్నారు. తాగునీటి పైపులైను పగిలిన ప్రాంతంలో గుంతలు ఏర్పడి అక్కడ మురుగు నీటిగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

మాకు తాగునీరు లేకుండా చేశారు

నాలుగురోజులుగా పైపు లైను పనులు చేశారు. గతంలో ఉన్న పైపులైను దెబ్బతినకుండా పైపులైన్‌ పనులు చేసుకోవాలని చెబితే వినలేదు. ఇష్టమొ చ్చినట్లు చేశారు మేం అడ్డుకుంటే ఆ కాసేపు ఊరుకుంటారు. ఎవరూ లేని సమయం, రాత్రిళ్లు పనులు చేస్తున్నారు. వీరి నిర్వాకంతో గతంలో పైపు లు పగిలాయి. మళ్లీ కొత్త పైపులు వేసేంత వరకు తాగునీటికి ఇబ్బందులేనా, అధికారులు స్పం దించి జరిగే పనులు ఆపించి పగిలిన పైపులు బాగు చేయించి నీరందించాలి.

- ఈశ్వరయ్య, శేషయ్యగారిపల్లె నివాసి

Updated Date - Sep 12 , 2024 | 11:19 PM

Advertising
Advertising