చదువుతోనే అభివృద్ధి: న్యాయాధికారి
ABN, Publish Date - Dec 29 , 2024 | 12:35 AM
ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదవాలని.. అప్పుడే అభివృద్ధి సాధ్యమని మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన, న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి సూచించారు
కదిరి లీగల్, డిసెంబర్ 28(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదవాలని.. అప్పుడే అభివృద్ధి సాధ్యమని మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన, న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి సూచించారు. శనివారం కదిరి కుటాగుళ్ల పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమెతో పాటు మరో న్యాయాధికారి ఎస్ ప్రతిమ పాల్గొన్నారు. జయలక్ష్మి మాట్లాడుతూ.. చదువులతో పాటు చట్టాలపై కూడా ప్రాథమిక దశ నుంచే అవగాహన పెంచుకోవాలన్నారు. న్యాయాధికారి ప్రతిమ మాట్లాడుతూ.. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదన్నారు. కొందరు పిల్లలు వాహనాలను నడుపుతూ చేస్తున్న విన్యాసాలు చూస్తే వణుకు పుడుతోందన్నారు. అప్పుడే ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులేనని హెచ్చరించారు. అనంతరం వ్యాసరచనలో పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందులో ప్రిన్సిపాల్ కే రమా, ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓబులరెడ్డి, న్యాయవాది లోకేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Dec 29 , 2024 | 12:35 AM