Godavari: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మరి కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక!

ABN, Publish Date - Jul 22 , 2024 | 09:58 AM

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మరి కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి వరద ఉదృతి క్రమక్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 11.70 అడుగులకు చేరుకుంది.

Godavari: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మరి కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక!

రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ (Cotton Barrage) వద్ద మరి కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి (Godavari) వరద ఉదృతి క్రమక్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 11.70 అడుగులకు చేరుకుంది. 11.75 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ అధికారులు జారీ చేయనున్నారు. 9.86 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. బ్యారేజ్ నుంచి 9 లక్షల 86 వేల క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల కానుంది.


చింతూరు ఏజన్సీలో వరద బీభత్సం కొనసాగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. శబరి, సీలేరు నదులు పొంగి పొర్లుతున్నాయి. వారం రోజులుగా ఎడతెగని వర్షాలతో జనం సతమతమవుతున్నారు. వరదల భయంతో బాధితులు పునరావాసానికి కదులుతున్నారు. రహదారుల పైకి వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయాందోళన నడుమ కొట్టుమిట్టాడుతున్నారు.


మరోవైపు భద్రాచలం వద్ద కూడా గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 46.7 అడుగులకు చేరుకుంది. పోలవరం వద్ద 12.5 మీటర్లకు నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.86 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. నీటిమట్టం 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో 5 ఎస్‌డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకా?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 22 , 2024 | 09:58 AM

Advertising
Advertising
<