Dipotsavam : వైభవం దీపోత్సవం
ABN, Publish Date - Nov 15 , 2024 | 11:34 PM
కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శివాలయాల్లో జ్వాలాతోరణం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొండాపురం మండలం దత్తాపురంలో అభయాంజనేయస్వామి ఆల యం వద్ద రావిచెట్టు, వేపచెట్టుకు కల్యాణం నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులు సా మూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించా రు.
శోభాయమానం...జ్వాలా తోరణం
మహిళలతో పోటెత్తిన ఆలయాలు
దత్తాపురంలో రావిచెట్టు,
వేపచెట్టుకు కల్యాణం
ప్రొద్దుటూరు టౌన్, నవంబరు15 (ఆంధ్రజ్యోతి):
కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని శివాలయాల్లో జ్వాలాతోరణం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొండాపురం మండలం దత్తాపురంలో అభయాంజనేయస్వామి ఆల యం వద్ద రావిచెట్టు, వేపచెట్టుకు కల్యాణం నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులు సా మూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించా రు. వివరాల్లోకెళితే...
శివాలయాల్లో జ్వాలాతోరణం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. శివాలయంలో అగస్త్యమహాముని ప్రతిష్ఠించిన శివలింగానికి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేకంగా అలంకరించారు. గణపతి, నవగ్రహ, చండీహోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సాయంత్రం జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, ఈఓ రామచంద్రాచార్యులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ముక్తి రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన సైకత లింగానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి, ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి విశేష పూజలు నిర్వహించి అమ్మవారి మూలవిరాట్టును గాజులతో అలంకరించారు.
హనుమత్ లింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు స్వయంగా అభిషేకించారు. సాయంత్రం జ్వాలా తోరణం వెలిగించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. పెన్నాతీరంలోని అమృతేశ్వరస్వామి ఆలయంలో మరకతలింగం, నవరత్న లింగం, జలలింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి జ్వాలాతోరణం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆకట్టుకున్న జ్వాలాతోరణం
బద్వేలుటౌన్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిట లాడాయి. ఆలయాలు కార్తీక దీప కాంతులతో వెలుగొందాయి. రూపరాంపేట శివాలయం, శివానందస్వామి ఆలయం, చెన్నంపల్లె భవానీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం, మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. ఓంకారేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి అలంకరణ, జ్వాలాతోరణం కను విందుచేశాయి.
సామూహిక సత్యనారాయణ వ్రతం...
బద్వేలునవంబరు 15 (ఆంధ్రజ్యోతి): గౌరీశంకర్ నగర్‌లో నిర్మించిన రమాదేవి సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. చెన్నంపల్లె శివాలయంలో శివ పార్వతుల కల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణాన్ని తిలకించి అన్నప్రసాదం స్వీకరించారు.
ఖాజీపేట మండలంలో....
ఖాజీపేట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అగ్రహారం శివాలయంలో, నాగనాదేశ్వరకోనలో భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. కొండపైన మహిళలు కార్తీక దీపాలు వెలిగించా రు. కొండ కింద కాశిరెడ్డినాయన ఆశ్రమంలో అన్నదానం చేశారు.
కార్తీకదీపాలతో శైవక్షేత్రాలు
పోరుమామిళ్ల, నవంబరు 15 (ఆంఽధ్రజ్యోతి): కార్తీకదీపాలతో శైవక్షేత్రాలు దేదీప్య మానంగా వెలుగొందాయి. బాలా త్రిపుర సుందరీదేవి రామ లింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జామున, రాత్రి మహిళలు కార్తీకదీపాలు వెలి గించారు. మధ్యాహ్నం ప్రత్యంగిరా హోమం నిర్వహించారు. రాత్రి ఆకాశదీపం వెలిగించారు.
రావిచెట్టు, వేపచెట్టుకు కల్యాణం
కొండాపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): దత్తాపురంలో అభయాంజనేయస్వామి ఆల యం వద్ద రావిచెట్టు, వేపచెట్టుకు గ్రామస్తులు కల్యాణం నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించారు. బాలప్పకోన, మల్లేశ్వరకోన, గండ్లూరు, చౌటిపల్లె కాశినాయన ఆలయాల్లో అన్నదానం చేపట్టారు. భజనలు చేశారు.
కాశినాయన మండలంలో....
కాశినాయన, నవంబరు15(ఆంధ్రజ్యోతి): చెన్నవరం, వరికుంట్ల, కనెకలగుండం, అక్కం పేట శివాలయాలు, జ్యోతిక్షేత్రం, గొంటువారి పల్లె సమీప నీలకంఠ ఆశ్రమాల్లో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. చెన్నవరం శివాల యంలో సత్యనారాయణ వ్రతం నిర్వహించా రు. నీలకంఠ ఆశ్రమంలో కార్తీక మహా దీపోత్స వం నిర్వహించారు. రాత్రికి కోలాటాలు, భజన లు ఏర్పాటు చేశారు.
దువ్వూరు మండలంలో....
దువ్వూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్దకు వెళ్లి దీపాలు వెలిగించారు. భీమలింగేశ్వర ఆలయం, పుల్లారెడ్డిపేటలోని త్రిపీఠికాలయంలో దేవున్ని దర్శించుకున్నారు.
బి.మఠం మండలంలో....
బ్రహ్మంగారిమఠం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జగన్మాత ఈశ్వరీదేవి సన్నిధానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. మఠాధిపతి వీర కుమారస్వామి దంపతులు చేపట్టారు. టీటీడీ ప్రోగ్రాం అసిస్టెంటు గోపీబాబు, జిల్లా ధర్మప్ర చార పరిషత్ సభ్యుడు చాపాడు వెంకటసు బ్బారెడ్డి కార్తీక పౌర్ణమి విశిష్టత వివరించారు.
జమ్మలమడుగు మండలంలో....
జమ్మలమడుగు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కుకున్నారు. సోమేశ్వరస్వామి దేవస్థానంలో జ్వాలాతోరణం నిర్వహించారు. కుండావారి వీధి శివాలయం, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయం, కన్యతీర్థం బాలాత్రిపుర సుందరీదేవి ఆలయాల్లో కార్తీక పౌర్ణమిని నిర్వహించారు.
అట్లూరు మండలంలో....
అట్లూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కొండూరు, అట్లూరు, కమలకూరు, కుంభగిరి, ముత్తుకూరు, మాడపూరు గ్రామాల శివాల యాల్లో గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి.
వెల్లాలలో జ్వాలాతోరణం...
రాజుపాలెం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): భీమలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జ్వా లాతోరణం నిర్వహించారు. మహిళలు పెద్దసం ఖ్యలో పాల్గొని దీపాలతో శివలింగం ఆవిష్క రించారు. ఏటా కార్తీక పూజలు నిర్వహిస్తారు.
Updated Date - Nov 15 , 2024 | 11:34 PM