ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ వాళ్లను బీజేపీలో చేర్చుకోకండి సార్‌

ABN, Publish Date - Dec 24 , 2024 | 11:47 PM

‘ సార్‌ గత ఐదేళ్లు వైసీపీ వాళ్లతో ఇబ్బందులు పడ్డాం.. అవమానాలు భరించాం. కేసులు పెట్టించుకున్నాం.. వాటిని తట్టుకొని మీ గెలుపు కోసం మేమంతా అహర్నిశలు శ్రమించాం.. మీ గెలుపు కోసం చాలా కష్టపడ్డాం. లక్షలు ఖర్చు పెట్టుకున్నాం.. మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఇప్పుడే ఆ వైసీపీ వాళ్లు అధికారం కోసం బీజేపీలో చేరుతున్నారు. అలాంటి నాయకులను బీజేపీలో చేర్చుకోకండి సార్‌.. ’ అని పోతుకుంటకు చెందిన టీడీపీ నాయకులు మంత్రిని కోరారు.

మంత్రితో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

ధర్మవరంరూరల్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి) : ‘ సార్‌ గత ఐదేళ్లు వైసీపీ వాళ్లతో ఇబ్బందులు పడ్డాం.. అవమానాలు భరించాం. కేసులు పెట్టించుకున్నాం.. వాటిని తట్టుకొని మీ గెలుపు కోసం మేమంతా అహర్నిశలు శ్రమించాం.. మీ గెలుపు కోసం చాలా కష్టపడ్డాం. లక్షలు ఖర్చు పెట్టుకున్నాం.. మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఇప్పుడే ఆ వైసీపీ వాళ్లు అధికారం కోసం బీజేపీలో చేరుతున్నారు. అలాంటి నాయకులను బీజేపీలో చేర్చుకోకండి సార్‌.. ’ అని పోతుకుంటకు చెందిన టీడీపీ నాయకులు మంత్రిని కోరారు. మంగళవారం మండలంలోని పోతుకుంట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సర్పంచ అంగజాల నాగవేణి భర్త అంగజాల రాజు మంత్రిని అనంతపురంలో కలిశారు. త్వరలో బీజేపీలో చేరుతానని మంత్రికి చెప్పారు. అనంతరం మంత్రి వెంట కుణుతూరులో జరిగే కార్యక్రమానికి అంగజాల రాజు వచ్చాడు. అక్కడే ఉన్న పోతుకుంటకు చెందిన టీడీపీ నాయకులు తలారి వెంకటలక్ష్మీ, పోతలయ్య, హరి, రవి, ఆది మంత్రి వద్దకు నేరుగా వెళ్లి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి, టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. దీనిపై మళ్లీ మాట్లాడుకుందామని వారి నచ్చజెప్పారు.

Updated Date - Dec 24 , 2024 | 11:47 PM