డీఎంహెచ్‌వోగా డాక్టర్ శర్మిష్ఠ
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:53 AM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ఎస్.శర్మిష్ఠను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పరిపాలనాపరమైన నిర్ణయాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎంహెచ్‌ల బదిలీల్లో ఏలూరు డీఎంఅండ్‌హెచ్‌వోగా పనిచేస్తున్న శర్మిష్ఠను కృష్ణాజిల్లాకు బదిలీ చేశారు.
-విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గీతాభాయి బదిలీ
మచిలీపట్నం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి):
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ఎస్.శర్మిష్ఠను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పరిపాలనాపరమైన నిర్ణయాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎంహెచ్‌ల బదిలీల్లో ఏలూరు డీఎంఅండ్‌హెచ్‌వోగా పనిచేస్తున్న శర్మిష్ఠను కృష్ణాజిల్లాకు బదిలీ చేశారు. గతంలో ఆమె జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఇక్కడ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న గీతాభాయిని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా బదిలీచేశారు. ఇటీవల కాలంలో గీతాభాయి పనితీరుపై పలు ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత కూడా పాత పద్ధతిలోనే వ్యవహరించడం, డీఎంహెచ్‌వో కార్యాలయంలో పరిపాలన గాడితప్పడం, ప్రతి పనికి నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతోనే గీతాభాయిని ఇక్కడి నుంచి బదిలీ చేశారని వైద్యశాఖ అధికారులు, ఉద్యోగులు చెవులు కొరుక్కుం టున్నారు.
Updated Date - Dec 22 , 2024 | 12:53 AM