ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Truck Driver : బైక్‌ను ఢీకొట్టి.. 2.5 కి.మీ. ఈడ్చుకెళ్లి..!

ABN, Publish Date - Dec 10 , 2024 | 05:48 AM

మద్యం మత్తులో ట్రాన్స్‌పోర్టు లారీ డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో చిన్నారి మృతిచెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

  • మద్యం మత్తులో లారీ డ్రైవర్‌ బీభత్సం

మద్దిపాడు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ట్రాన్స్‌పోర్టు లారీ డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో చిన్నారి మృతిచెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఒంగోలు నుంచి రాజమండ్రికి వెళుతున్న క్రాంతి ట్రాన్స్‌పోర్టు లారీ అతివేగంతో వస్తూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారాంపురం వచ్చేసరికి రోడ్డుపై స్టాపర్లను ఢీకొంది. అదే వేగంతో ముందుకెళ్లి రోడ్డు దాటడానికి వేచి ఉన్న బైక్‌ను ఢీకొంది. లారీ వెనక కొక్కేనికి బైక్‌ ఇరుక్కుపోయింది. డ్రైవర్‌ లారీని ఆపకుండా ముందుకు పోతూ రోడ్డుపక్కన నడుస్తున్న ఇద్దరినీ ఢీకొట్టడంతో ఎగిరి పక్కన పడ్డారు. తీవ్రగాయాలైన ఇద్దరినీ ఆస్పత్రికి తరలిస్తుండగా కోస్టాల్‌కు చెందిన గోరంట్ల రష్యంత్‌(5) మృతిచెందాడు. తినుబండారాలు కొనేందుకు పినతండ్రి రామాంజనేయులు తీసుకుని రాగా లారీ వారిపైకి దూసుకెళ్లింది. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు వెంబడించి, 2.5 కిలోమీటర్ల దూరం వెళ్లాక లారీని ఆపారు. లారీడ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 10 , 2024 | 05:48 AM