ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Duvvada Srinivas: ఏడో రోజుకు దువ్వాడ ఫ్యామిలీ డ్రామా.. ఐదో నంబర్ దగ్గర బ్రేక్..

ABN, Publish Date - Aug 14 , 2024 | 12:12 PM

వైసీపీ ఎమ్మెల్సీ ఫ్యామిలీ డ్రామా టీవీ సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. ఎవరి నోట విన్నా.. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో సోమవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. అదే ఆస్తుల పంపకం వ్యవహారం.. దీంతో డ్రామాకు ఎండ్ కార్డ్ పడుతుందని అంతా భావించారు.

శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ ఫ్యామిలీ డ్రామా టీవీ సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. ఎవరి నోట విన్నా.. ఎక్కడ చూసినా ఇదే టాపిక్. దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో సోమవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. అదే ఆస్తుల పంపకం వ్యవహారం.. దీంతో డ్రామాకు ఎండ్ కార్డ్ పడుతుందని అంతా భావించారు. కానీ అంతులేని కథ సినిమా మాదిరిగా ఇక ఎండ్ కార్డ్ పడుతుంది అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ట్విస్ట్‌తో సాగుతూనే ఉంది. ఆస్తుల పంపకం విషయంలో కండీషన్ నంబర్ 5 వద్దకు వచ్చి ఆగిపోయింది. దువ్వాడ ఫ్యామిలీ డ్రామా.. ఏడవ రోజుకు చేరింది. దువ్వాడకి ఆయన భార్య వాణి పెట్టిన కండీషన్స్‌పై ప్రతిష్టంభన కొనసాగుతోంది.


వాణి కండీషన్స్ ఏంటంటే..

1. పర్లాకిమిడిలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ వర్త్ 20 కోట్ల నలబై లక్షల రూపాయలు కాగా.. బ్యాంకు అప్పు క్లియర్ చేసి ఆ ఆస్తిని దాఖలు చేయాలి.

2. టెక్కలి పట్టణంలో వెంకటేశ్వర కాలనీలోని ఆరు కోట్ల పాత ఇంటిపై ఉన్న 15 లక్షల బ్యాంకు రుణం క్లియర్ చేసి ఆ ఆస్తిని దాఖలు చేయాలి.

3. పిల్లల చదువులతో పాటు వారి మెయింటెనెన్స్ బాధ్యతను తండ్రిగా శ్రీనివాస్ చూసుకోవాలి.

4. విడాకుల విషయాన్ని సామరస్యంగా న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలి.

5. కొత్త ఇంటిని శ్రీనివాస్ తదనంతరం తమకు దాఖలు చేస్తామన్న విషయంపై వీలునామా తక్షణమే రాసి ఇవ్వాలి.


పై నాలుగు డిమాండ్లపై దువ్వాడ సానుకూలత వ్యక్తం చేశారు కానీ ఐదు డిమాండ్‌పై మాత్రం కొంత అనిశ్చితి నెలకొంది. తనకంటూ మిగిలిన ఆ ఒక్క ఆస్తి విషయంలో తక్షణమే వీలునామా రాస్తే తన పరిస్థితి ఏంటని దువ్వాడ ప్రశ్నిస్తున్నారు. ఐదో డిమాండ్ వద్ద దువ్వాడ కుటుంబం పంచాయితీకి బ్రేక్ పడింది. ఎక్కడ చూసినా ఇదేం రచ్చరా బాబోయ్ అనుకున్న బంధువులు దీనికి ఫుల్‌స్టాప్ పెడతామని రంగంలోకి దిగారు. చర్చలు సాగించారు. అవి కూడా సత్ఫలితాన్నిచ్చేలా కనిపించడం లేదు. తొలుత దువ్వాడ కూతుళ్లు.. ఆ తరువాత భార్య రంగంలోకి దిగారు. ఆ తరువాత ఈ వ్యవహారంలో దివ్వెల మాధురి వచ్చి చేరారు. వీరందరి మధ్య పోలీసులు.. మాధురి ఆత్మహత్య డ్రామా.. బాబోయ్ మాంచి ఫ్యామిలీ సీరియల్‌ను చూస్తున్నట్టుగా ఉంది ప్రేక్షకులకు. మొత్తానికి దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందన్న విషయమే తెలియకుండా ఉంది.

Updated Date - Aug 14 , 2024 | 12:12 PM

Advertising
Advertising
<