26 నుంచి పీఠంలో పవిత్రోత్సవాలు
ABN, Publish Date - Dec 23 , 2024 | 12:51 AM
మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు తెలిపారు.
రాయవరం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు తెలిపారు. ఆది వారం ఆయన మాట్లాడుతూ 26, 27, 28 తేదీల్లో విజయదుర్గా అమ్మవారికి పవిత్రోత్సవాలు వైఖానస సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రవిత్రోత్సవాల్లో భాగంగా విజయదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు, హోమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు గాదే భాస్కర నారాయణ, సత్యవెంకట కామేశ్వరి, బి.రమ, పెద్దపాటి సత్య కనకదుర్గ, పీఆర్వో బాబి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 12:51 AM