ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజమహేంద్రిలో సినీ నటి శ్రీలీల సందడి

ABN, Publish Date - Dec 12 , 2024 | 12:41 AM

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిర్మించిన ది చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం బుధ వారం ఘనంగా జరిగింది. 5 ఫ్లోర్లలో సువిశాలంగా దీనిని నిర్మించారు. చీరలు, డ్రసెస్‌లు, మెన్స్‌వేర్‌ అన్ని రకాల వస్త్రాలతో అద్భుతమైన రం

బంగారు ఆభరణాలతో సందడి చేస్తున్న శ్రీలీల

ది చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిర్మించిన ది చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం బుధ వారం ఘనంగా జరిగింది. 5 ఫ్లోర్లలో సువిశాలంగా దీనిని నిర్మించారు. చీరలు, డ్రసెస్‌లు, మెన్స్‌వేర్‌ అన్ని రకాల వస్త్రాలతో అద్భుతమైన రంగులతో ఆఫర్‌ ధరలతో వస్త్రాలను అందుబాటులో ఉంచారు. ఈ షాపింగ్‌ మాల్‌ను సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. తొలుత శ్రీలీలకు చెన్నయ్‌ షోరూం నిర్వాహకులు ఎం.జనార్దన్‌రెడ్డి, జమున, ఎం.వెంకటరెడ్డి, మధులత స్వాగతం పలికారు. అన్ని ఫ్లోర్లలో వస్త్రాలను, జ్యుయలరీ విభాగాన్ని శ్రీలీల పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభించడానికి రాజమహేంద్రవరం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నాకు నచ్చిన రంగుల వస్త్రాలు చెన్నయ్‌ షాపింగ్‌ మాల్‌లో లభ్యమవుతున్నాయన్నారు. ఇటువంటి వాటి కోసం గతంలో చెన్నై వెళ్లాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చెన్నయ్‌ షాపింగ్‌ మాల్స్‌లో లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు. తాను నటించిన రాబిన్‌హుడ్‌ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుందని ప్రేక్షకులు విజయవంతం చేయాలన్నారు. శ్రీలీలను చూడానికి వచ్చిన జనంతో ఆర్‌టీసీ బస్టాండ్‌ రోడ్డు కళకళలాడింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ను ఏర్పాటు చేసి 600మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - Dec 12 , 2024 | 12:41 AM