ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: సీతానగరం వాసికి టీటీడీ బోర్డులో అవకాశం.. కూటమి పార్టీల హర్షం..

ABN, Publish Date - Oct 31 , 2024 | 01:05 PM

అక్కిన ముని కోటేశ్వరరావును తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యునిగా నియమించారు. ఆయన నియామకంపై నియోజకవర్గానికి చెందని కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన కోటేశ్వరరావు కొన్నేళ్ల నుంచి రాజమహేంద్రవరంలో....

Akkina Muni Nageswara rao

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలానికి చెందిన అక్కిన ముని కోటేశ్వరరావును తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యునిగా నియమించారు. ఆయన నియామకంపై నియోజకవర్గానికి చెందిన కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన కోటేశ్వరరావు కొన్నేళ్ల నుంచి రాజమహేంద్రవరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారవేత్తగా సొంత గ్రామం అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించారు.


స్వగ్రామంలో మూడేళ్ల క్రితం కోటి రూపాయల సొంత నిధులతో కైలాస భూమి నిర్మించారు. తన సొంతూరు ప్రజలకు తాగునీటిని అందించే ఉద్దేశంతో తన వాటర్ ప్లాంట్‌ను గ్రామానికి అప్పగించారు. పద్మావతి అమ్మవారి ఆలయ పనులకు భారీ విరాళం అందించారు. ఏడాదిన్నర క్రితం రాజంపేటలో రూ.26 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మించారు. రఘుదేవపురంలో రూ.5కోట్లతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుంటున్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా కోటేశ్వరరావుకు అవకాశం లభించింది.


కూటమి నేతల అభినందనలు

రాజానగరం నియోజకవర్గం సీతానాగరం మండలానికి చెందిన అక్కిన ముని కోటేశ్వరరావును టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించడం పట్ల రాజానగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరితో పాటు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కోటేశ్వరరావును తన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీరన్నచౌదరి మాట్లాడుతూ.. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తిని టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించడంతో ఏటిగట్టు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తికి తగిన గుర్తింపునిచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, ఎన్డీయే కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడిలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్రను టీటీడీ పాలకమండలిలో నియమించారని, ఆ తరువాత నియోజకవర్గ పునర్ వ్యవస్థీకరణలో రాజానగరం నియోజకవర్గంగా ఏర్పడటంతో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తికి మళ్లీ ఇప్పుడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించడం తమ ప్రాంతానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. బీజేపీతో పాటు టీడీపీ, జనసేన నేతలు సైతం అక్కిన ముని కోటేశ్వరరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు టీటీడీ ట్రస్టుబోర్డులో సభ్యులుగా అవకాశం దక్కింది. ఎమ్మెల్యే కోటాలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకు అవకాశం దక్కగా.. సీతానగరం మండలానికి చెందిన వ్యాపారవేత్త కోటేశ్వరరావుకు టీటీడీ పాలకమండలిలో అవకాశం లభించింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 31 , 2024 | 01:41 PM