ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోవింద శంఖారావం

ABN, Publish Date - Sep 26 , 2024 | 01:23 AM

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని కల్తీచేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్న ప్రధాన డిమాండ్‌తో గోవింద శంఖారావం పేరిట హిందూ సంఘాలు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అమలాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిపాలవీధిలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి వందలాది మంది నిరసన ర్యాలీగా బయలుదేరారు.

జగన్‌ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న దృశ్యం

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 25: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని కల్తీచేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్న ప్రధాన డిమాండ్‌తో గోవింద శంఖారావం పేరిట హిందూ సంఘాలు, కూటమి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అమలాపురంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిపాలవీధిలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి వందలాది మంది నిరసన ర్యాలీగా బయలుదేరారు. ముమ్మిడివరం గేటు సెంటర్‌ మీదుగా గడియార స్తంభం సెంటర్‌కు చేరుకున్నారు. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, రథాలు, విగ్రహాల ధ్వంసం జరిగినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ఏకంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన కలియుగ దైవం తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని వైసీపీ నేతలు కల్తీ చేయడాన్ని యావత్తు ప్రపంచం యావగించుకుందని విమర్శించారు. లడ్డూ ప్రసాదం కల్తీకి కారణమైన దోషులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుకుంటామంటూ వందలాది మంది కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. మాజీ సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనలో నాయకులు మెట్ల రమణబాబు, నల్లా పవన్‌కుమార్‌, మోకా వెంకటసుబ్బారావు, ఆకుల బుజ్జి, చిక్కం భీముడు, పిండి రాజా, గండి స్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌, ఇస్కాన్‌, సామాజిక సమరసతా వేదిక, గీతా మందిరం ప్రతినిధులు డాక్టర్‌ గోదశి గంగరాజు, పులిమే రాజా, శిరంగు నాయుడు, ఆకుల బాబి-శ్రీదేవి, కోకా రాంబాబు, మేడిశెట్టి నాగభూషణం, కోన గురుస్వామి, నల్లా త్రిమూర్తులు, వరదా సూరిబాబు, నల్లా కరుణాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 01:23 AM