మంత్రి పదవికి అమిత్‌షా రాజీనామా చేయాలి
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:32 AM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
అమలాపురంటౌన్, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అమిత్‌షా తక్షణం జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తొలుత కలెక్టరేట్ ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, నియోజకవర్గ కోఆర్డినేటర్ అయితాబత్తుల సుభాషిణి, ఏఐసీసీ సభ్యుడు చీకట్ల అబ్బాయి, యార్లగడ్డ రవీంద్ర, పట్టణ శాఖ అధ్యక్షుడు వంటెద్దు బాబి, నాయకులు గెడ్డం సురేష్‌బాబు, మాచవరపు శివన్నారాయణ, కోట శ్రీనివాసరావు, పాలెపు ధర్మారావు, సరెళ్ల ప్రసన్నకుమార్, రౌతు ఈశ్వరరావు, షకీలా, అప్పన రామకృష్ణ, దేవరపల్లి రాజేంద్రబాబు, కుడుపూడి శ్రీనివాసరావు, అయితాబత్తుల కుమార్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 01:32 AM