ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సత్యదేవునికి... కాసులు కురిపించిన కార్తీకమాసం

ABN, Publish Date - Dec 03 , 2024 | 12:00 AM

అన్నవరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఈ ఏడాది కార్తీకమాసం కాసులు కురిపించింది. ఇప్పటికే వ్రతాల నిర్వహణలో ఆల్‌ టైం రికార్డు నెలకొల్పగా తాజాగా సోమవారం హుండీల లెక్కింపుతో కార్తీకమాస ఆదాయాన్ని అధికారు లు వెల్లడించారు. అన్ని విభాగాల ద్వారా రూ.21,13,82,068

అన్ని విభాగాల ద్వారా రూ.21.13 కోట్ల ఆదాయం

అన్నవరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడికి ఈ ఏడాది కార్తీకమాసం కాసులు కురిపించింది. ఇప్పటికే వ్రతాల నిర్వహణలో ఆల్‌ టైం రికార్డు నెలకొల్పగా తాజాగా సోమవారం హుండీల లెక్కింపుతో కార్తీకమాస ఆదాయాన్ని అధికారు లు వెల్లడించారు. అన్ని విభాగాల ద్వారా రూ.21,13,82,068 ఆదాయం లబించింది. గతేడాదితో పోలిస్తే రూ.45 లక్షల ఆదా యం అధికంగా వచ్చింది. ఈ ఆదా యం రికార్డుగా నిలిచింది. ప్రధానంగా వ్రతం టిక్కెట్లు విక్రయం ద్వారా రూ.8.33 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.4.86 కోట్లు, హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3. 04 కోట్లు, సత్రం గదుల అద్దెల ద్వారా రూ.1.43 కోట్లు స్వామివారికి సమకూరింది. గతేడాది కంటే అన్ని విభాగాల ద్వారా ఆదాయం పెరగగా లీజులు విభాగం వసూళ్లు, ఇతర మిస్‌లీనియస్‌ ఆదా యపరం గా గతేడాదితో పోలిస్తే రూ.2.64 కోట్లు తగ్గింది. కార్తీకమాసంలో సుమారు కోటిమంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు.

గతేడాది కార్తీకమాస ఆదాయం, ఈ ఏడాది కార్తీకమాసం

ప్రధాన విభాగాల ఆదాయం ఈ పట్టికలో చూడవచ్చు.

విభాగము 2023(రూ.లో) 2024 (రూ.లో)

వ్రతం టిక్కెట్లు విక్రయాలు 7,03 కోట్లు 8.33 కోట్లు

ప్రసాదం విక్రయాలు 4.38 కోట్లు 4.86 కోట్లు

హుండీలలో వచ్చిన కానుకలు 2.81 కోట్లు 3.04 కోట్లు

సత్రం గదుల అద్దెల ద్వారా 89.98 లక్షలు 1.43 కోట్లు

కల్యాణ మండపాలు 5.47 లక్షలు 8.41 లక్షలు

ప్రత్యేక దర్శనాలు 67.01 లక్షలు 85.82 లక్షలు

ఏసీ వ్రతాల నిర్వహణ 47.60 లక్షలు 60.45 లక్షలు

రవాణా విభాగం 27.03 లక్షలు 40.81 లక్షలు

లైసెన్స్‌ ఇతర ఆదాయాలు 3.73 కోట్లు 1.09 కోట్లు

హుండీల ఆదాయం రూ.1.30 కోట్లు

సత్యదేవుని సన్నిధిలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. రూ.1,30,30,404 నగదు, 52.500 గ్రాముల బంగారం, 1125 గ్రాముల వెండి సమకూరాయి. వీటితో పాటు పలు దేశాల కరెన్సీ లభించింది. 13 రోజులకు ఈ ఆదాయం సమకూరింది. సరాసరిన రోజుకు రూ.10.02 లక్షలు చొప్పున భక్తులు హుండీల్లో కానుకల రూపంలో సమర్పించారు. సిబ్బంది లెక్కించగా చైర్మన్‌ రోహిత్‌, ఈవో త్రినాథరావు పర్యవేక్షించారు.

Updated Date - Dec 03 , 2024 | 12:00 AM