పిఠాపురంలో ముగిసిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు
ABN, Publish Date - Dec 21 , 2024 | 12:50 AM
పిఠాపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజుల పాటు జరిగిన 8వ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. వివిధ జిల్లాల నుంచి 150మందికి పైగా బాక్సర్లు పాల్గొన్నారు. బాక్సర్ల బరువు ఆధారంగా వా
ఓవరాల్ చాంఫియన్‌షిప్ కైవసం చేసుకున్న విశాఖ జిల్లా
రెండో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం జిల్లా
జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు పదిమంది ఎంపిక
పిఠాపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు రోజుల పాటు జరిగిన 8వ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. వివిధ జిల్లాల నుంచి 150మందికి పైగా బాక్సర్లు పాల్గొన్నారు. బాక్సర్ల బరువు ఆధారంగా వారిని పది కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహించారు. ప్రతి విభాగంలో ఒకరికి గోల్డ్ మెడల్, మరొకరి సిల్వర్ మెడల్ అందించగా, ఇద్దరికి బ్రా ంజ్ మెడల్స్ బహుకరించారు. శుక్రవారం జరిగిన ఫైనల్ పోటీలను తిలకించేందుకు విద్యార్థులు, ప్రజలు అధికంగా తరలివచ్చారు. ఈ పోటీలు చివరివరకూ ఉత్కంఠభరితంగా జరిగాయి. ఓవరాల్ చాంఫియన్‌షిప్ విశాఖ జిల్లా బాక్సర్లు కైవసం చేసుకోగా, రెండో స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలిచింది. పది విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన పదిమంది బాక్సర్లను జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక చేశారు. వారు ఉత్తరప్రదేశ్‌లో జనవరి 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జ ట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణరావు ప్రకటించారు. పోటీల్లోని విజేతలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాసకుమార్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత డాక్టర్ ఐ.వెంకటేశ్వరరావు, రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి.లక్ష్మణదేవ్, పి.లక్ష్మణరావు బహుమతులు, మెడల్స్ బహుకరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనుబాబు, కేతవరపు కృష్ణ, పాఠశాల విద్యాకమిటీ వైస్‌చైర్మన్ సూర్యావతి, బల్ల నవీన్‌వంశీ, సాయిఅఖిల్, కె.చిన్నబ్బాయి, జె.ప్రసాదరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.
మెడల్స్ సాధించిన బాక్సర్లు వీరే
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల 47-50కిలోల విభాగంలో పి.పవన్(విశాఖ జిల్లా) గోల్డ్‌మెడల్ సాధించగా, వై.ప్రభుదాస్(తిరుపతి)కి సిల్వర్‌మెడల్, ఎస్.రాంబాబు(కడప), ఎమ్.జయంత్ సా యిస్వరూప్(మన్యం)లకు బ్రాంజ్‌మెడల్స్ లభించాయి. 50-55కిలోల విభాగంలో సీహెచ్.జన్నేశ్వరరావు(శ్రీకాకుళం), పి.ప్రసాద్(విశాఖ)లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్, బాలగణేష్‌రెడ్డి(కడప), సూర్యదేవేందర్(నంద్యాల)లకు బ్రాంజ్‌మెడల్స్... 55-60 కిలోల విభాగంలో పి.అపల్పరాజు(శ్రీకాకుళం), డి.సందీప్(విశాఖ)లకు గోల్డ్, సిల్వర్.. ఎస్‌కే బాజీబాబా(ఎన్టీఆర్‌జిల్లా), పి.దిగ్విజయ్(కడప)లకు బ్రాంజ్‌మెడల్స్... 60-65కిలోల విభాగంలో భానుప్రకాష్(విశాఖ), పి.విశేశ్వరరావు(శ్రీకాకుళం)లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్... జయసాయితరుణ్(నెల్లూ రు), ఎన్.సతీష్(పశ్చిమగోదావరి)లకు బ్రాంజ్ మెడల్స్ లభించాయి.
65-70కిలోల విభాగంలో ఎం.అంజనీకుమార్(విశాఖ), లోకేష్(శ్రీకాకుళం)లకు గోల్డ్, సిల్వర్.. పి.బాలాజీ(తిరుపతి), కె.చంద్రశేఖర్(విజయనగరం)లకు బ్రాంజ్‌మెడల్స్, 70-75కిలోల విభాగం లో ఎస్‌కే ముజీబ్ రహ్మాన్(విశాఖ), ఎస్.ఏసు(శ్రీకాకుళం)లకు గోల్డ్, సిల్వర్.. ఎన్.హరికృష్ణ, బి.కార్తీక్(అనంతపురం)లకు బ్రాంజ్.. 75-80కిలోల వి భాగంలో ఎస్.సాయితేజ(విశాఖ), కె.శ్రీకాంత్(శ్రీకాకుళం)లకు గోల్డ్, సిల్వర్.. ఎం.సాగర్(నెల్లూ రు), జి.పవన్‌కుమార్(ఎన్టీఆర్‌జిల్లా)లకు బ్రాం జ్.. 80-85కిలోల విభాగంలో వి.శ్రీధర్(పశ్చిమగోదావరి), ఎం.దినేష్‌రెడ్డి(అనంతపురం)లకు గోల్డ్, సిల్వర్.. బి.జగదీష్‌నాయుడు(కడప), కె.రామ్(కడప), 85-90కిలోల విభాగంలో ఎల్.సాయివెంకట్(పశ్చిమగోదావరి), డి.మనోజ్‌కుమార్(శ్రీకాకుళం)లకు గోల్డ్, సిల్వర్.. టి.జస్వంత్(ప్రకాశం), వి.అభిషేక్(విజయనగరం)లకు బ్రాంజ్ మెడల్స్ లభించగా, 90కిలోలు అంతకంటే అధిక బరువు కలిగిన వారి విభాగంలో ఆర్.హేమంత్‌కుమార్(శ్రీకాకుళం) గోల్డ్‌మెడల్ సాధించగా, వై.వినయ్(ఎన్‌టీఆర్) సిల్వర్‌మెడల్, బి.ద్రావిడ్(బాపట్ల జిల్లా), డి.వెంకటేశ్వరుడు(విజయనగరం)లు బ్రాంజ్ మెడల్స్ గెలుపొందారు.
Updated Date - Dec 21 , 2024 | 12:50 AM