‘పాస్టర్లకు గౌరవ వేతనం అమలులోకి తీసుకురావాలి’
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:26 AM
కాకినాడ సిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాస్టర్లకు గౌరవ వేతనం తిరిగి అమలులోకి తీసుకురావాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మోసా అబ్రహం, కౌన్సిల్ ప్రతినిధులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసి కోరారు. గతంలో రాష్ట్రంలో 8596
కాకినాడ సిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాస్టర్లకు గౌరవ వేతనం తిరిగి అమలులోకి తీసుకురావాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మోసా అబ్రహం, కౌన్సిల్ ప్రతినిధులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను సోమవారం ఆయన నివాసంలో కలిసి కోరారు. గతంలో రాష్ట్రంలో 8596మంది పాస్టర్లు గౌరవ వేతనం పొందేవారని, ఈ పథకాన్ని తిరిగి అమలులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమం లో కౌన్సిల్ కాకినాడ జిల్లా చిల్డ్రన్ వింగ్ అధ్యక్షుడు కాసరపు సింహాద్రి, జిల్లా ఎస్సీ సంక్షేమ వింగ్ అధ్యక్షుడు టీఎస్ రాజు, జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్‌కుమార్, కాకినాడ సిటీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, సిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మోజెస్ కుమార్, సిటీ కార్యదర్శి వనమాటి సుందర్, ఎస్సీ సంక్షేమ వింగ్ అధ్యక్షుడు టి.సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:26 AM