ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొబ్బరి ధరల పెంపు

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:00 AM

అంబాజీపేట, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కొబ్బరి మద్దతు ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని కొబ్బరి పండించే రాష్ర్టాల్లో రైతులను ఆదుకునే విధంగా నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోలు చేసే ధరలను స్వల్పంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశం లో పండించే పంటలకు మద్ద

మార్కెట్‌లో కురిడి కొబ్బరి

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

స్వల్పంగా మద్దతు ధరలు పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం

మిల్లింగ్‌కోప్రాకు రూ.422, బాల్‌కోప్రాకు రూ.100 మద్దతు ధరపెంపు

అంబాజీపేట, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కొబ్బరి మద్దతు ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని కొబ్బరి పండించే రాష్ర్టాల్లో రైతులను ఆదుకునే విధంగా నాఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోలు చేసే ధరలను స్వల్పంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశం లో పండించే పంటలకు మద్దతు ధర నిర్ణయించేందుకు ప్రతి ఏటా డిసెంబరు నెలలో ఆయా రాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర కేబినెట్‌లో ప్రవేశపెడుతుంది. అనంతరం కేబినెట్‌ ఆమోదించిన అనంతరం పంటలపై మద్దతు ధరలను కేంద్రప్రభుత్వం ప్రకటిస్తుంది. దీనిలో భాగంగా కొబ్బరికి స్వల్పంగా మద్దతు ధరలను పెంచుతూ కేబినెట్‌ ఆమోదించింది. 2024 సంవత్సరంలో మిల్లింగ్‌ కోప్రా రూ. 11160 ఉండగా 2025 సంవత్సరానికి రూ.422 పెంచి రూ.11,582గా నిర్ణయించింది. అలాగే 2024లో బాల్‌కోప్రా 12,000 ఉండగా రూ.100 పెంచి రూ.12,100గా నిర్ణయించారు. 2025 లో ఆయా రాష్ర్టాల్లో నాఫెడ్‌ కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసి ఈ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బహిరంగ మా ర్కెట్లో కొబ్బరి ధరలు రూ.12వేలు పైబడి ఉం డటం తో ఇప్పుడు నా ఫెడ్‌ కేంద్రాలు తె రిచిన పెద్దగా ప్ర యోజనం ఉం డద ని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా రైతులు కేంద్రం పెంచిన ధరలపై పెదవిరుస్తున్నారు. కొబ్బరి కనీస మద్దతు ధర రూ.15వేలు పైబడి ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న కొబ్బరిరైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ధరల ను పెంచాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ సభ్యులు కోరుతున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 01:00 AM