ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముగ్గురు ఏపీవోలకు షోకాజ్‌ నోటీసులు

ABN, Publish Date - Dec 20 , 2024 | 01:15 AM

క్యాటిల్‌ షెడ్స్‌ పనులకు నిర్ధేశించిన 715 షెడ్స్‌లో ఇప్పటి వరకు లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఏపీవోలకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని డ్వామా పీడీని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు.

కలెక్టర్‌ ప్రశాంతి సమీక్ష

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 19( ఆంధ్రజ్యోతి): క్యాటిల్‌ షెడ్స్‌ పనులకు నిర్ధేశించిన 715 షెడ్స్‌లో ఇప్పటి వరకు లక్ష్యాలను చేరుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఏపీవోలకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని డ్వామా పీడీని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు.కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో గురువా రం ఉపాధి హామీ పనుల సమీక్షలో కలెక్టర్‌ క్యాటిల్‌ షెడ్స్‌పై ఆరా తీసారు. ఇప్పటి వరకు 73 షెడ్లు పూర్తి కాగా 40 రూఫ్‌లెవెల్‌, 150 బేస్‌మెంట్‌, 386 పునాదిలో ఉండడంపై వివ రణ కోరారు. పనుల విషయంలో నిర్లక్ష్యంవహించిన రంగంపేట, కోరుకొండ, నల్లజర్ల, ఏపీవోలకి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని పీడీ ని ఆదేశించారు. ఉపాధి హామీ పనులు డిసెంబరు నెలాఖరు నాటికి జిల్లాకి కేటాయించిన 44 లక్షల పనిదినాల్లో ఇప్పటివరకు 42లక్షల 90 వేలు పూర్తి చేశారని మిగిలినవి పూర్తి చేయాలన్నారు.సగటు వేతనం రూ.256గా చెల్లిస్తున్నామన్నారు. ఈ మొత్తం రూ.300 వరకు చేరేలా పనులు గుర్తింపు ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపండుగ పనులు నూరు శాతం జనవరి 12 కల్లా పూర్తి చేయాలన్నారు. 645 సీసీ రోడ్లు నిర్మాణ పనుల్లో 51 పూర్తికాగా 169 లేయర్‌ వరకు వచ్చాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.గ్రామాల వారీ పనులపై మం డల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు.సమీక్షలో డ్వామా పీడీ నాగమహేశ్వరరావు, ఇంజనీర్లు, ఏపీవోలు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 01:15 AM