ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్జీదారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:10 AM

అర్జీదారుల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీరాణి, సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావుతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు.

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 2: అర్జీదారుల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీరాణి, సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావుతో కలిసి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్‌ స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలపై అవగాహన కలిగించుకుని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ నిర్వహించి పరిష్కరించాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 180 అర్జీలను స్వీకరించారు. సచివాలయ నోడల్‌ అధికారి కె.భీమేశ్వర్‌, డీఆర్డీఏ పీడీ డాక్టర్‌ వి.శివశంకరప్రసాద్‌, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.దుర్గారావుదొర, డీఈవో ఎం.కమలకుమారితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 12:10 AM

Advertising
Advertising