నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:14 AM
పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏలేరు వరదలు, అధికవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం అందిందని సీపీఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ విమర్శించారు. పిఠాపురం లయన్స్ కల్యాణమండపం వద్ద బుధవారం కోనేటి రాజు అధ్యక్షతన జరిగిన సీపీఎం రెండవ మహాసభలో ఆయన మాట్లాడు
సీపీఎం జిల్లా కన్వీనర్ రాజశేఖర్
పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏలేరు వరదలు, అధికవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం అందిందని సీపీఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ విమర్శించారు. పిఠాపురం లయన్స్ కల్యాణమండపం వద్ద బుధవారం కోనేటి రాజు అధ్యక్షతన జరిగిన సీపీఎం రెండవ మహాసభలో ఆయన మాట్లాడుతూ కొద్దిమంది రైతులకే ఎకరాకు రూ.10వేలు పరిహారం చెల్లించారని, పంటలు నష్టపోయిన అందరికీ ఎకరానికి రూ.25వేలు వంతున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకమేటలు వేసిన ప్రాంతాల్లో ప్రభుత్వమే చదును చేసి సాగుకు పనికి వచ్చేలా చూడాలని కోరారు. ఇసుకరీచ్‌ల వద్ద ప్రభుత్వమే వాహనాలు ఏర్పా టు చేసి ఉచితంగా ఇసుక అందించాలని సూచి ంచారు. జిల్లా నాయకులు దువ్వా శేషుబాబ్జి, కరణం ప్రసాద్, విశ్వనాథం, సూర్యనారాయణ, నందీశ్వరరావు, శీరందాసు రమేష్ పాల్గొన్నారు.
నూతన కన్వీనింగ్ కమిటీ ఏర్పాటు
సీపీఎం పిఠాపురం పట్టణ, మండల కన్వీనింగ్ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా కుంచే చిన్నా, సభ్యులుగా కోనేటి రాజు, కె.మణి, కె.నాగేశ్వరరావు, మణికంఠ, డి.తులసి, జి.వీరబాబులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Updated Date - Oct 24 , 2024 | 12:14 AM