శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు
ABN, Publish Date - Dec 21 , 2024 | 01:24 AM
జిల్లాలోని వ్యవసాయ, పశుసంవర్థక శాఖ పనితీరు మెరుగుపరిచేందుకు ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు.
అమలాపురం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వ్యవసాయ, పశుసంవర్థక శాఖ పనితీరు మెరుగుపరిచేందుకు ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వ్యవసాయ, పశుసంవర్థకశాఖ వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఆయా శాఖల డయాగ్నోసిస్ లేబోరేటరీల పనితీరుపై ఆరా తీశారు. వాటికి అవసరమైన మరమ్మతులకు అంచనాలు రూపొందించాలని పంచాయతీరాజ్ ఎస్‌ఈని ఆదేశించారు. ల్యాబ్‌లలో ఎక్విప్‌మెంట్ మరమ్మతులు, అవసరమైన ఔషధాల కోసం అంచనాల ప్రణాళికలు రూపొందించి ఈనెల 26 నాటికి అందించాలన్నారు. జేసీ టి.నిషాంతి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వెంకట్రావు, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Dec 21 , 2024 | 01:24 AM