సమస్యల గుర్తింపు... పరిష్కారం దిశగా అడుగులు
ABN, Publish Date - Oct 06 , 2024 | 12:04 AM
గొల్లప్రోలు, అక్టోబరు 5: పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యలు, విద్య, వైద్యరంగానికి సంబంధించి అత్య వసరంగా చేపట్టాల్సిన పనుల గుర్తింపు, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కార్యాల
గొల్లప్రోలులో పర్యటించిన డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు
గొల్లప్రోలు, అక్టోబరు 5: పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యలు, విద్య, వైద్యరంగానికి సంబంధించి అత్య వసరంగా చేపట్టాల్సిన పనుల గుర్తింపు, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ ఓఎస్‌డీ మధుసూదన్, కార్యాలయ అధికారి శివరాంలు గొల్లప్రోలుతో పాటు మండలంలోని గ్రామాల్లో శనివారం పర్యటించారు. గొల్లప్రోలులో అసంపూర్తిగా నిలిచిన అర్బన్ పీహెచ్‌సీ భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం, రూలర్ పీహెచ్‌సీకి రోడ్డు నిర్మాణం, గొల్లప్రోలు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నీరు గారుతున్న తరగతి గదులు, తాగునీటి సమస్య, బాలికోన్నత పాఠశాలకు విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదుల నిర్మాణం, గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణం, గొల్లప్రోలు జగనన్న కాలనీకి ముం పు బెడద లేకుండా రోడ్డు నిర్మాణం, జాతీయరహదారి నుం చి రహదారి నిర్మాణానికి ఉన్న భూమి సేకరణ సమస్య, డం పింగ్‌యార్డు ఆవశ్యకత, గొల్లప్రోలు సూర్యుడు చెరువు చు ట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడం, పట్టణ శివారు సూరంపేటకు బ్రిడ్జి నిర్మాణం, తాటిపర్తి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మధ్యలో ఉన్న కరెంటు తీగల తొలగింపు, జూనియర్ కళాశాల ఏర్పాటు, వన్నెపూడి శ్మశానవాటికకు రోడ్డు నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్స్ ఏర్పాటు, గొల్లప్రోలులో టీటీడీ కల్యాణమండపం నిర్మాణం తదితర అంశాలు, సమస్యలను వారు గుర్తించారు. వాటిని ఏ విధంగా చేపట్టాలన్న అంశంపై అధికారులతో చర్చించారు. వారి వెంట గొల్లప్రోలు తహశీల్దార్ సత్యనారాయణ, నగర పంచాయతీ కమిషనరు రవికుమార్, ఏఈ ప్రభాకర్, విద్యాశాఖాధికారులు తదితరులు ఉన్నారు.
Updated Date - Oct 06 , 2024 | 12:04 AM