ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డిప్యూటీ సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌

ABN, Publish Date - Nov 04 , 2024 | 12:30 AM

పిఠాపురం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లా లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోమవారం జరపనున్న పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ తెలిపారు. పవన్‌ పర్యటన జరిగే గొల్లప్రోలు జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండ

గొల్లప్రోలులో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టరు షాన్‌ మోహన్‌, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, జేసీ రాహుల్‌ మీనా

పిఠాపురం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లా లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సోమవారం జరపనున్న పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ తెలిపారు. పవన్‌ పర్యటన జరిగే గొల్లప్రోలు జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండపాలను ఆయన జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌మీనాలతో కలిసి ఆదివారం పరిశీలించారు. అక్కడే శం కుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ జరగనున్న నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లుపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కొత్తపల్లి, కాకినాడ రూరల్‌ మండలాల్లో పర్యటించారు. వారి వెంట జడ్పీ సీఈవో వీవీఎస్‌ లక్ష్మణరావు, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, డీఎస్పీ రఘువీర్‌ విష్ణు, ఎస్‌బీ డీఎస్పీ రామకోటేశ్వరరావు, పిఠాపురం సీఐ శ్రీనివాస్‌, మునిసిపల్‌ కమిషనర్లు రవికుమార్‌, కనకారావు, ఎంపీడీవో కర్రి స్వప్న తదితరులు ఉన్నారు. గొల్లప్రోలు జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాట్లను ఆదివారం రాత్రి కలెక్టర్‌ మరోమారు పరిశీలించారు. పవన్‌ రోడ్డుమార్గంలో వస్తున్నట్టు షెడ్యూల్‌లో వచ్చినా హెలిప్యాడ్‌ ను ప్రత్యామ్నాయంగా సిద్దం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఉన్నత పాఠశాల సమీపంలోని హెలిప్యాడ్‌ వద్ద తుప్పలు తొలగించి శుభ్రం చేసే పనులను నిర్వహించారు.

భారీ బందోబస్తు

పవన్‌ పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక డీఎస్పీ, తొమ్మిది మంది సీఐలు, 29మంది ఎస్‌ఐలు, 78మంది ఏఎస్‌ఐ, హెచ్‌సీలు, 155మంది పీసీలు, 18మంది మహిళా పోలీసులు, 50మందితో కూడి న 8 స్పెషల్‌పార్టీలను వినియోగించనున్నారు. మొత్తం 340మంది బందోబస్తులో ఉండనున్నారు.

Updated Date - Nov 04 , 2024 | 12:30 AM