పంటకాలువ కబ్జాపై పవన్ ఆగ్రహం
ABN, Publish Date - Oct 26 , 2024 | 12:06 AM
పిఠాపురం రూరల్, అక్టోబరు 25: పంటకాలువను కబ్జా చేసిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించగా అధికారులు కదిలారు. ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టా రు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలోని పంటకాలువను కబ్జా చేసి లేఅవుట్ నిర్వా
తక్షణం పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు - ఆంధ్య్రజ్యోతి ఎఫెక్ట్
పిఠాపురం రూరల్, అక్టోబరు 25: పంటకాలువను కబ్జా చేసిన విషయంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించగా అధికారులు కదిలారు. ఆక్రమణలు తొలగించే పనులు చేపట్టా రు. పిఠాపురం మండలం కోలంక గ్రామంలోని పంటకాలువను కబ్జా చేసి లేఅవుట్ నిర్వాహకులు రహదారి నిర్మించే ప్రయత్నం చేస్తున్న విషయంపై ఆంధ్రజ్యోతిలో వార్తా కథనం ప్రచురితమైంది. ఆంధ్రజ్యోతి వార్త డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టరు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. 60 ఎకరాలకు సాగునీరు అం దించే పంటకాలువను కబ్జా చేయడంపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాటిని ఉపేక్షించవద్దని, తక్షణం పంటకాలువ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో సర్వే చేసినా ఆక్రమణలు తొలగించలేదని అధికారులను ప్రశ్నించారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గవద్దని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎవరు తప్పు చేసినా నాతో సహా ఉపేక్షించవద్దు, చట్టం, నిబంధనల ప్రకారం వెళ్లాలని తాను చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు కదిలారు. కోలంక చేరుకుని పంటకాలువను పునరుద్ధరించే పనులు చేపట్టారు. కబ్జా చేసిన కాలువను తవ్వడం ప్రారంభించారు. త్వరలోనే కాలువ పూర్వ స్థితికి వస్తుందని తెలిపారు.
Updated Date - Oct 26 , 2024 | 12:06 AM