ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్‌స్తంభాన్ని ఎట్టకేలకు తొలగించారు

ABN, Publish Date - Oct 17 , 2024 | 12:28 AM

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు మండలం తాటిపర్తి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా విద్యుత్‌స్తంభాన్ని అధికారులు ఎట్టకేలకు తొలగించారు. పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఈ విద్యుత్‌స్తంభం కారణంగా పలువురు విద్యార్థులు కరెంటు షాక్‌కు

తాటిపర్తిలో పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని మారుస్తున్న దృశ్యం

పవన్‌ చొరవతో పరిష్కారం

ఎక్స్‌లో పోస్టు చేసిన డిప్యూటీ సీఎం కార్యాలయం

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): గొల్లప్రోలు మండలం తాటిపర్తి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా విద్యుత్‌స్తంభాన్ని అధికారులు ఎట్టకేలకు తొలగించారు. పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఈ విద్యుత్‌స్తంభం కారణంగా పలువురు విద్యార్థులు కరెంటు షాక్‌కు గురయ్యారని, దాని వల్ల ఇబ్బందులు పడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ దృష్టికి వచ్చింది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యుత్‌ స్తంభాన్ని తక్షణం అక్కడ నుంచి మార్చాలని, విద్యుత్‌షాక్‌ కొట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధి కారులను అదేశించారు. దీంతో ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు సదరు స్తంభాన్ని అక్కడ నుంచి మార్చి షాక్‌ కొట్టకుండా రక్షణ చర్యలు చేపటా ్టరు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం కార్యాలయం బుధవారం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేసింది.

Updated Date - Oct 17 , 2024 | 12:28 AM