వినియోగంలోకి ఆర్వో ప్లాంట్లు
ABN, Publish Date - Oct 20 , 2024 | 12:30 AM
పిఠాపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూని యర్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవతో పరిష్కారం లభించింది. కళాశాలకు నాడు-నేడు పనుల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో రూ.12లక్షల వ్యయంతో రెండు ఆర్వో ప్లాం
పిఠాపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూని యర్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవతో పరిష్కారం లభించింది. కళాశాలకు నాడు-నేడు పనుల్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో రూ.12లక్షల వ్యయంతో రెండు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నాణ్యతాలోపంతో అవి కొంతకాలానికే మరమ్మతులకు గురయ్యాయి. పలుమార్లు అధ్యాపకులు, అధికారులు కాంట్రాక్టర్ చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో తాగునీటి కోసం కొంతకాలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 600మంది విద్యార్థులకు తాగునీరు అందుబాటులో లేని పరిస్థితి ఏర్ప డింది. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తక్షణం సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్వో ప్లాంట్లుకు మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తీసుకొచ్చారు. విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Updated Date - Oct 20 , 2024 | 12:30 AM