Share News

తూర్పుగోదావరి జిల్లా ఓటర్లు 16,05,762

ABN , Publish Date - Jan 23 , 2024 | 01:22 AM

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. 2024 ఎస్‌ఎస్‌ఆర్‌ తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,05,762 మంది. అందులో పురుషు లు 7,85,142 మంది, మహిళలు 8,20,515 మంది, థర్డ్‌ జండర్‌ 105 మంది ఉన్నారు. జిల్లాలో పురుషులకంటే మహిళలే ఓటర్లు అధికంగా నమోదయ్యారు. పురుషుల

తూర్పుగోదావరి జిల్లా ఓటర్లు 16,05,762
ఓటర్ల జాబితా విడుదల చేస్తున్న జిల్లా కలెక్టర్‌, జేసీ తదితరులు

పురుషులు7,85,142

మహిళలు 8,20,515

థర్డ్‌ జెండర్‌ 105

జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 35, 373 మంది అఽధికం

రాజమహేంద్రవరం రూరల్‌లో అత్యధికంగా 2,71,159 మంది ఓటర్లు

కొవ్వూరులో అతి తక్కువగా 1, 83,405 మంది ఓటర్లు

ఎస్‌ఎస్‌ఆర్‌-2024 ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన కలెక్టర్‌ మాధవీలత

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. 2024 ఎస్‌ఎస్‌ఆర్‌ తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 16,05,762 మంది. అందులో పురుషు లు 7,85,142 మంది, మహిళలు 8,20,515 మంది, థర్డ్‌ జండర్‌ 105 మంది ఉన్నారు. జిల్లాలో పురుషులకంటే మహిళలే ఓటర్లు అధికంగా నమోదయ్యారు. పురుషులకంటే మహిళలు 35,373 మంది ఎక్కువగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇక జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా రాజమహేంద్రవ రం రూరల్‌ నమోదైంది. అక్కడ 2,71159 మంది ఓటర్లున్నారు. అందులో మహిళలు 1,38,604 మం ది ఉండగా, పురుషులు 1,32,531 మంది ఉన్నారు. థర్డ్‌ జండర్‌ 24 మంది ఉన్నారు. అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కొవ్వూరు. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,83,405 మంది, పురుషులు 89, 442 మంది, మహిళలు 93,958 మంది, థర్డ్‌ జెండర్‌ అయిదుగురు ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఓటర్ల సంఖ్యపరంగా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 2,60360 మంది ఓటర్లు ఉన్నారు. అం దులో మహిళలు 1,34,663 మంది ఉండగా, పురుషులు 1,25,639 మంది ఉన్నారు. థర్డ్‌ జండర్లు 58 మంది ఉన్నారు. గోపాలపురం నియోజకవర్గం ఓటర్లపరంగా మూడో స్థానం ఉంది. ఇక్కడ 2,41,798 మంది ఉండగా, పురుషులు 1,18,783 మంది, మహిళలు 1,23,008 మంది ఉన్నారు. థర్డ్‌ జెండర్‌ ఏడుగురు ఉన్నారు. అనపర్తి నాల్గో స్థానంలో ఉంది. ఇక్కడ 2,23,255మంది ఓటర్లు ఉం డగా అందులో పురుషులు 109323 మంది, మహిళలు 113930 మంది, థర్డ్‌ జెండర్‌ ఇద్దరు ఉన్నా రు. రాజానగరం ఐదో స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 260360 మంది. అందులో పురుషులు 105824మంది, మహిళలు 108083 మంది ఉన్నారు. థర్త్‌ జెండర్‌ నలుగురు ఉన్నారు. నిడదవోలుది ఆరో స్థానం. ఇక్కడ మొత్తం 211874మంది ఓటర్లుండగా, అందులో పురుషులు 103600 మంది, మహిళలు 108269 మంది. కొవ్వూరుది అతి తక్కువ ఓటర్లతో చివరి స్థానం. కాగా ఇంకా ఎవరైనా ఓటు నమోదుకు అర్హులైనవారు ఉంటే, ఈసీఐ ఎన్నికల షెడ్యూల్‌ జారీచేసినా కూడా నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు వరకూ ఓటు హక్కు పొందవచ్చని కలెక్టర్‌ డాక్టర్‌ కె. మాధవీలత తెలిపారు. అభ్యంతరాలు, సవరణల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

661 మంది సర్వీసు ఓటర్లు

జిల్లాలో ఎస్‌ఎస్‌ఆర్‌ -2024 తుది జాబితా ప్రకారం 661 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. అన పర్తి నియోజకవర్గంలో డిఫెన్స్‌ సర్వీసు ఓటర్లు 45 మంది ఉన్నారు. రాజానగరంలో 64 మంది ఉ న్నారు. అందులో స్పౌజ్‌ కూడా ఉన్నారు. మొత్తం 65 మంది ఉన్నారు. రాజమహేంద్రవరం సిటీలో డిఫెన్స్‌ సర్వీసు ఓటర్లు 101, స్పౌజెస్‌ 13తో కలసి మొత్తం 114 మంది ఉన్నారు. ఇక్కడ ఫారన్‌ సర్వీసు ఓటరు ఒకరు ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌లో డిఫెన్స్‌ సర్వీసు ఓటర్లు 97, స్పౌజెస్‌ 12 మొత్తం 109 మంది, ఫారన్‌ సర్వీసు ఓటరు ఒకరు, స్పౌజ్‌ ఒకరు ఉన్నారు. కొవ్వూరు ఎస్‌సి నియోజకవర్గంలో డిఫెన్స్‌ ఓటర్లు 109, స్పౌజ్‌ 2 కలిపి మొత్తం 111మంది ఉన్నారు. నిడదవోలులో డిఫెన్స్‌ సర్వీసు ఓటర్లు 152 మంది, స్పౌజ్‌ ఏడు కలిపి మొత్తం 159 మంది ఉన్నారు. గోపాలపురం ఎస్‌సి నియోజకవర్గంలో డిఫెన్స్‌ సర్వీసు ఓటర్లు 83, స్పౌజ్‌ రెండు కలిపి మొత్తం 85 మంది ఉన్నా రు. జిల్లాలో మొత్తం డిఫెన్స్‌ సర్వీసు ఓటర్లు 651 మంది, స్పౌజెస్‌ 37 మంది కలిపి మొత్తం 688 మంది ఉన్నారు. ఫారన్‌ సర్వీసు ఓటర్లు ఇద్దరు, స్పౌజ్‌ ఒకరు కలిపి మొత్తం ముగ్గురు ఉన్నారు. డిఫెన్స్‌, ఫారన్‌ సర్వీసు ఓటర్లు మొత్తం కలిపి 691 మంది ఉన్నారు.

18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్లు

అక్టోబరులో ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న కొత్త ఓటర్లు 11,512 మంది చేరగా, తుది జాబితా నాటికి 37,200 మంది పెరిగారు. స్పెషల్‌ డ్రెవ్‌, కాలేజీల వంటి ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌తో నమోదు వల్ల ఈ సంఖ్య పెరిగిందని కలెక్టర్‌ తెలిపారు.

శాశ్వత వలస, మరణించిన 116 ఓటర్ల తొలగింపు

గతేడాది అక్టోబరు 27న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకూ జిల్లాలో పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న 1196 ఇళ్లను గుర్తించారు. అందులో 14,791 మంది ఓటర్లున్నారు. వాటిని విచారణ జరిపి ఫారమ్‌-8 ద్వారా 5588 మంది ఓటర్ల చిరునామా మార్పు చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. శాశ్వతంగా వలస వెళ్లిపోయివారు, మరణించిన వారు 116 మంది ఓట ర్లు ఉండగా ఫారమ్‌- 7 ద్వారా వారిని తొలగించినట్టు కలెక్టర్‌ తెలిపారు. జంక్‌ క్యారెక్టర్‌ కలిగిన 12 ఇళ్లు గుర్తిం చారు. అందులో 14మంది ఓటర్లు ఉన్నారు. వాటికి ఫారమ్‌-8 ద్వారా దరఖాస్తు చేయించారు. ఒకే రివిజన్‌లో రెండు దరఖాస్తులు పెట్టిన కారణంగా ఈ 14 ఫారమ్‌- 8 లు ఈ-రోల్‌లో అప్‌డేట్‌ కాలేదు. రివిజన్‌ పూర్తిచేసిన తర్వాత అప్‌డేట్‌ చేస్తామని కలెక్టర్‌ తెలియజేశారు.

హోం ఓటింగ్‌ సౌకర్యం

జిల్లాలో 18,722 మంది పీడబ్ల్యుడీ ఓటర్లు, 80 ఏళ్లు దాటిన ఓటర్లు 28,386 మంది ఉన్నారు. 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారికి, 80 ఏళ్లు దాటిన వారికి వచ్చే ఎన్నికల్లో హోంఓటింగ్‌ సౌకర్యం ఉందని, దీనికి ఫారమ్‌-12డి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

2024 2023 2024 2023 2024 2023 2024 2023

నియోజకవర్గం- పేరు పురుషులు మహిళ థర్డ్‌ జెండర్‌ మొత్తం

40. అనపర్తి 109323 106168 113930 109558 2 0 223255 215726

49. రాజానగరం 105824 102239 108083 104187 4 9 213911 213911

50. రాజమహేంద్రవరం సిటీ 125639 123533 134663 131716 58 62 260360 255311

51. రాజమహ్రేంవరం రూరల్‌ 132531 125942 138604 131469 24 16 271159 257427

54, కొవ్వూరు 89442 86463 93,958 90855 5 9 183405 177327

55. నిడదవోలు 103600 101213 108269 104964 5 8 211874 206185

66. గోపాలపురం 118783 115468 123008 118379 7 10 241798 233857

మొత్తం 7,85,142 761026 8,20,515 791128 105 114 1,60,5762 1552268

Updated Date - Jan 23 , 2024 | 01:22 AM