Share News

రయ్‌..రయ్‌..

ABN , Publish Date - Mar 06 , 2025 | 01:51 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్‌ రహ దారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రహదారులపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తీరా ఇవి అత్యంత ఇరుకైన రహదారులు కావడంతో నిత్యం ట్రాఫిక్‌ నరకం

రయ్‌..రయ్‌..
రామచంద్రపురం- కరప - కాకినాడ రోడ్డు

ఉమ్మడి తూ.గో. జిల్లాలో పీపీపీ విధానంలో రహదారుల అభివృద్ధి

కాకినాడ-జొన్నాడ, కాకినాడ- రాజమహేంద్రవరం కెనాల్‌ రోడ్ల ఎంపిక

వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధికి నిర్ణయం

సాధ్యాసాధ్యాలపై డీపీఆర్‌ల తయారీ బాధ్యత

ఎల్‌ఎన్‌ మాలవ్య సంస్థకు అప్పగింత

ఈ రోడ్లపై వాహన రద్దీ, ఎంత కాలానికి

పీపీపీ అనేదానిపై ఏడాదిలో అధ్యయన నివేదిక

కాకినాడ-జొన్నాడ రహదారి అభివృద్ధికి

రూ.225 కోట్లు ఖర్చవుతుందని అంచనా

కరప, వేళంగి, ఆలమూరు, మండపేటలలో

బైపాస్‌లు నిర్మాణంతో భారీగా పెరగనున్న ఖర్చు

అటు కెనాల్‌ రోడ్డు అభివృద్ధికి రూ.160 కోట్ల

వరకు వ్యయం అవుతుందని అంచనా

అన్నీ కుదిరితే వచ్చే ఏడాదే ఈ రహదారుల నిర్మాణానికి టెండర్లు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్‌ రహ దారులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రహదారులపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తీరా ఇవి అత్యంత ఇరుకైన రహదారులు కావడంతో నిత్యం ట్రాఫిక్‌ నరకంతోపాటు ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయిం చింది. వీటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక తయారుచేసే బాధ్యతను తాజాగా ఎల్‌ఎన్‌ మాలవ్య కంపెనీకి అప్ప గించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో పలు పట్టణాలు, నగరాలు, జాతీయ రహదారిని కలిపే అనేక కీలక రహదారు లు గడచిన అయిదేళ్లలో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఏమాత్రం అభివృద్ధికి నోచుకోక ప్రయాణి కులకు నరకం చూపిస్తున్నాయి. ఒకపక్క భారీ గుంతలు పడ్డా గత వైసీపీ సర్కారు వీటిని గాలికి వదిలేసింది. దీంతో ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రహదారులను కోట్లు ఖర్చుచేసి మరమ్మతులు చేసింది. అయితే వీటిలో అత్యంత కీలకమైన రోడ్లను మాత్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని, వీటికయ్యే ఖర్చును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా భరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఉమ్మడి తూ ర్పుగోదావరి జిల్లాలో రెండు రహదారుల ను ఎంపిక చేసింది. వీటిలో ఒకటి కాకి నాడ-జొన్నాడ, మరొకటి కాకినాడ-రాజమ హేంద్రవరం కెనాల్‌ రోడ్డు. 62 కిలోమీటర్ల పొడవున్న కాకినాడ- జొ న్నాడ రహదారి ఉమ్మడి జిల్లాలో అత్యంత కీలకం. కాకినాడ జిల్లా నుంచి కోన సీమ జిల్లాకు అనుసంధానించే ఈ రహదారి ద్వారా రావులపాలెం జాతీయ రహదారికి చేరుకోవచ్చు. అయితే ఈ రోడ్డు కాకినాడ నగరం నుంచి కరప, వేళంగి, రామచంద్రపురం, మండపేట, ఆలమూరు మీదుగా వెళ్తుంది. నిత్యం ఈ రోడ్డు భారీగా రద్దీగా ఉంటుంది. రావుల పాలెం, విజయవాడ, హైదరాబాద్‌ వెళ్లే బస్సులు, కార్లు, ఇతర లారీలన్నీ ఈ దారి మీదుగానే ప్రయాణిస్తాయి. కానీ ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఈ రహదారి ఇప్పు డున్న ట్రాఫిక్‌ను ఏమాత్రం తట్టుకోలేని విధంగా మారింది. రోడ్డు ఎక్కడికక్కడ చాలా చిన్నది కావడంతో వచ్చీపోయే వాహనాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ ఆర్‌అండ్‌బీ రహదారిని పీపీపీ విధా నంలో భారీస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు 50 కిలో మీటర్ల పొడవు న్న కాకినాడ-రాజమహేం ద్రవరం కెనాల్‌ రోడ్డు సైతం ఈ రెండు నగరాలను కలిపే కీలక రహదారి. ఒక రకంగా ఏడీబీ రోడ్డుతో పోల్చితే కెనాల్‌ రోడ్డు ద్వారా రెండు నగరాల మధ్య దూరం తక్కువ. ప్రస్తుతం లారీలు, కార్లు, బస్సులు ఇతర వాహనాలన్నీ ఈ రోడ్డుపై నుంచే వెళ్తున్నాయి. మధ్యలో అనేక గ్రా మాలు, పట్టణాలు ఉండడంతో ట్రాఫిక్‌ దారుణంగా ఉంటోంది. రహదారి చాలా ఇరుగ్గా ఉండడంతో నిత్యం నరకమే. దీంతో దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

వచ్చే ఏడాదిలోగా పనులు..

ఈ రెండు రహదారులను పీపీపీ విధా నంలో భారీగా అభి వృద్ధి చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. వీటి నిర్మాణ సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేయించడానికి సిద్ధమైంది. ఈమేరకు ప్యాకేజీ 3 కింద డీపీఆర్‌ తయారీ బాధ్యతలు అప్పగించ డానికి టెండర్లు పిలిచింది. వీటిని తాజాగా మధ్యప్రదేశ్‌కు చెంది ఎల్‌ఎన్‌ మాలవ్య సంస్థ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. త్వర లో ఈ రెండు రహదారుల అభివృద్ధి ఈ కంపెనీ పూర్తిస్థాయి నివేదిక తయారు చేయనుంది. అందులోభాగంగా ఈ రోడ్లను అభివృద్ధి చేసే విషయంలో సాధ్యాసాధ్యా లపై అధ్యయనం చేయనుంది. ఆయా రోడ్లపై వాహనరద్దీ ఎంత ఉంది అనేదా నిపై కొంతకాలం పరిశీలించనుంది. ఈ రోడ్లను అభివృద్ధి చేస్తే ఎంత కాలానికి పీపీపీ విధానంలో కాంట్రాక్టర్‌కు అప్పగిం చవచ్చు.. టోల్‌ వసూలెంత చేయాల్సి ఉం టుంది.. రహదారిని నిర్మించిన తర్వాత టోల్‌ ద్వారా కాంట్రాక్టర్‌కు వెచ్చించినంత మొత్తం రాకపోతే ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ద్వారా ఎంత చెల్లించాలి? తదితర అంశాలపై డీపీఆర్‌లో ఈ కంపెనీ వివరించనుంది. ఈ నివేదికను వచ్చే ఏడా ది ఈ సంస్థ ప్రభుత్వానికి అప్పగించనుం ది. ఆ తర్వాత రోడ్లను విస్తరించి కొత్తగా నిర్మించడానికి టెండర్లను పిలవనుంది. కాకినాడ-జొన్నాడ రహదారిలో ఇప్పటికే పలు పట్టణాలు, గ్రామాలు భారీగా విస్త రించినందున నాలుగులేన్ల కొత్త రహదారి అభివృద్ధికి భూములు, ఇళ్లు సేకరించాల్సి వస్తుందని, అదే జరిగితే ఖర్చు భారీగా ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈనేపథ్యంలో కరప, వేళంగి, మండపేట, ఆలమూరు మీదుగా కొత్తగా బైపాస్‌ లు నిర్మించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు రూ.225కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అలాగే కెనాల్‌ రోడ్డుకు సైతం నాలుగు రహదారులు నిర్మించాల్సి రావడం, అటు అనపర్తి, వేమగిరి పట్టణాల మీదుగా రహదారి వెళ్తుండడంతో వీటిని బైపాస్‌ చేస్తూ కొత్తగా రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే కేశవరం,వేట్లపాలెం, బ్రహ్మదేవం ప్రాంతాల్లో కాలువ, రైల్వే ట్రాక్‌, రోడ్డు పక్కపక్కనే ఉన్నాయి. ఈనేపథ్యంలో వీటి వద్ద కూడా బైపాస్‌ అవసరం. మిగిలిన రహదారి వెంబడి కాలువ ఉండడంతో భూసేకరణకు పెద్దగా ఖర్చు కాదు. అయితే ఈరోడ్డును అభివృద్ధి చేయాలని ఇప్పటికే కూటమి అధికారంలోకి రాగానే సీఎం చంద్ర బాబును కలిపి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా వినతిపత్రం అందించారు. దీంతో పీపీపీ విధానంలో ఈ రోడ్డు చేర్చారు. అయితే కెనాల్‌ రోడ్డుకు రూ.160 కోట్ల కంటే ఎక్కువ వ్యయం అవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు.

Updated Date - Mar 06 , 2025 | 01:51 AM