ఇక ఎవరు..ఆశీర్వదిస్తారు!
ABN, Publish Date - Dec 22 , 2024 | 01:33 AM
ఏమీ అర్ధం కావడంలేదు.. నిన్నటి వరకూ మా మధ్యనే ఎంతో చలాకీగా తిరిగింది.. ప్రతి రోజూ ఏనుగును చూసేవాడిని.. రేపటి నుంచి కనబడదంటే తట్టుకోలేక పోతున్నాం.. కన్నీటి పర్యంతమవుతూ ఒక పెద్దాయన అన్న మాట..
కన్నీటి పర్యంతమైన గ్రామస్తులు
తండోపతండాలుగా వచ్చిన జనం
రేపటి నుంచి ఎలా అని ఆవేదన
పెదకొండేపూడిలో ఖననం
ర్యాలీగా వెళ్లిన జనం
అజీర్తా.. గుండెపోటా?
రాజమహేంద్రవరం/సీతానగరం, డిసెంబరు 21 ఆంధ్రజ్యోతి : ఏమీ అర్ధం కావడంలేదు.. నిన్నటి వరకూ మా మధ్యనే ఎంతో చలాకీగా తిరిగింది.. ప్రతి రోజూ ఏనుగును చూసేవాడిని.. రేపటి నుంచి కనబడదంటే తట్టుకోలేక పోతున్నాం.. కన్నీటి పర్యంతమవుతూ ఒక పెద్దాయన అన్న మాట..ఆ గ్రామంలో ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి.. ఎందుకంటే ఒకటా రెండా ఏకంగా 19 ఏళ్ల అనుబంధం.. ఏనుగును ఇంట్లో మనిషిలా చూస్తారు..వారు వండుకున్నదే పెడతారు.. అయినా ఏం మాట్లాడదు.. పెట్టింది తిని ఆశీర్వదించి వెళ్లిపోతోంది.. రేపటి నుంచి ఎవరి వద్ద ఆశీర్వాదం తీసుకోవాలని మరొక పెద్దావిడ కన్నీటి పర్యంతమైంది. శనివారం రఘుదేవపురంలో ఎవరిని కదిపినా ఇదే పరిస్థితి.. ఏనుగు మృతితో ఊరంతా బోరుమని ఏడ్చింది.. ఠీవిగా నడిచి వెళ్లే ఏనుగు.. జీవశ్ఛవంగా వెళుతుంటే తట్టుకోలేకపోయారు.. సమాధి వరకూ ర్యాలీగా వెళ్లి తుది వీడ్కోలు పలికారు.. ఏనుగును చూస్తే ఎవరైనా భయపడతారు.. ఆ గ్రామంలో మాత్రం దాని దగ్గరకు వెళ్లి ఆశీ ర్వాదం తీసుకుంటారు. మిగి లిన జంతువులు రోడ్డుపై ఎలా వెళ్లిపోతాయో.. ఏనుగు అంతే.. ఇదెక్కడో మారుమూల కాదు.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురంలో పరిస్థితి.. నిన్నటి వరకూ ఆ ఏనుగు జనంతో మమేకమై నడిచింది.. ఏం జరిగిందో ఏమో కానీ శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కన్నుమూసింది.దీంతో మన జిల్లా లోనూ ఒక ఏనుగు ఉం దని ప్రపంచానికి తెలి సింది.ఆ ఏనుగును చూసేందుకు తండోప తండాలుగా జనం తరలివ చ్చారు. విగతజీవిగా పడి ఉన్న గజేంద్రుడిని చూసి చలించిపోయారు. లేమ్మా అంటూ లేప డానికి ప్రయత్నించారు. అయినా కదలికలేదు. ఏనుగులు 70-80 ఏళ్ల పాటు జీవిస్తాయి. కానీ ‘లీలావతి’ 18 ఏళ్లకే కన్ను మూయడం ఆ గ్రామస్తులను కలచి వేసింది.అటవీశాఖ అనుమతి మేరకు శనివారం సాయంత్రం పెదకొండేపూడి గ్రామంలోని చిట్టిబాబాజీ ఆశ్ర మానికి చెందిన గోసాల సమీపంలో సమాధి చేసి అంత్యక్రియలు నర్విహించారు.బాజా భజంత్రీల మధ్య లీల మృతదేహాన్ని పెదకొండేపూడి తీసుకెళ్లారు
2009 నుంచి ఇక్కడే..
ఏనుగులు దేవాలయాల్లో, ఆశ్రమాల్లో ఉండ డం కొత్త కాదు. మనకు తక్కువ గానీ కేరళ, తమిళనాడులో దాదాపు ప్రతి ప్రఖ్యాత దేవాల యంలో ఏనుగులు భక్తులకు ఆశీర్వాదాలను అం దిస్తూ వారిచ్చిన దక్షిణను ఒడుపుగా తొం డంతో అందుకుంటాయి.మన జిల్లాలోనూ నిన్నటి వర కూ అటువంటి ఆశ్రమం ఒకటి ఉండేది. ఆ ఆశ్ర మానికి వెళితే ఏనుగు ఆశీర్వదించేది.. 2009వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన అప్పటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జార్జిఖండ్ సీతానగరం మండలం రఘుదేవపురంలోని సద్గురు శ్రీ చిట్టిబాబాజీ సంస్థానం చారిటబుల్ ట్రస్ట్‌కు 3.5 ఏళ్ల వయసున్న ఏనుగును బహూకరించారు. ఏనుగుకు లీల అని నామకరణం చేశారు.దీనికి ప్రత్యేకంగా ఒక భవనం కూడా నిర్మించారు. అందులోనే మావటిలు ఉండేవారు. ప్రస్తుతం దాని వయస్సు 19 సంవత్సరాలు. మావటిలు ప్రతి రోజూ తెల్లవారుజామున గోదావరి నది స్నానానికి తీసువెళ్లేవారు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో భక్తులు పెట్టిన పండ్లు, స్వీట్లు, బ్రెడ్లు ఎవరికి తోచినది వారు తినిపించి లీల ఆశీర్వాదం తీసుకునేవారు.చిన్నతనం నుంచి గ్రా మంలోనే ఉండడంతో గ్రామస్తులను ఎంతో మచ్చిక అయ్యింది.రేపటి నుంచి లీల ఆశీర్వాదం దొరకదన్న వార్త స్థానికులను కలచివేస్తోంది. గ్రామస్తులకు కన్నీళ్లు మిగిల్చింది.
అసలేం జరిగింది?
లీల శుక్రవారం రాత్రి 7.30గంటల సమ యం లో బాగానే ఉంది. రాత్రి 11.30 గంటల సమ యంలో ఒక్కసారిగా కింద పడిపోవడంతో దాని బాగోగులు చూసే మావటిలు తిరు చూర్ లోని వైద్యుడికి ఫోన్ చేశారు. స్థానిక వైద్యు లను వెంటనే రప్పించాలని ఆయన సలహా ఇచ్చారు. స్థానిక వైద్యుడు వచ్చేసరికే లీలావతి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. తొండం అచే తనమైపోయింది. చెవులు నెమ్మదిగా ఊగుతు న్నాయి.కళ్లల్లో జీవం దాదాపుగా పోయింది. డాక్టరు వచ్చి ప్రయత్నించినా ఫలితం లేకపో యింది.లీల మరణ సమయానికి 4 టన్నుల బరువు ఉంది.అది సాధారణ బరువే. ఈ వయసులో ఇవి రోజుకు 60 కిలోల వరకూ తింటాయి.అయితే ఈ ఏనుగు మరణానికి సివి యర్ ఎసిడోసిస్ కారణంగా తెలుస్తోంది. ఈ జంతువు తిని అరిగించుకునేవి కాకుండా భక్తులు ఇష్టానుసారం అన్నం, ఇడ్లీలు వంటివి పెట్టడంతో అజీర్తి చేసి.. కడుపులో లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి ఎక్కువై గ్యాస్ అధికంగా విడు దలయ్యే అవకాశం ఉంది.అలా జరిగితే ఊపిరి తిత్తులకు గాలి సర ఫరా నిలిచిపోయి వాటితో పాటు, గుండె ఆగిపోయి మరణిస్తాయి.
2 గంటలు మృత్యువుతో పోరాడి..
ఆ మూగజీవి తన ప్రాణాలు ఎవరైనా కా పాడ తారని చివరి క్షణం వరకూ కొట్టు మిట్టాడినట్లు పరిస్థితులు చెబుతున్నాయి. అజీర్తి వల్ల ఎక్కు వగా ఇబ్బంది వస్తే కడుపు నొప్పి విపరీతంగా వస్తుంది. ఆ సమయంలో ఏనుగు ప్రవర్తన మారిపోతుంది. కళ్లలోంచి నీళ్లు వస్తాయి. శరీ రం లోపల గ్యాస్ పట్టేయడం వల్ల అరవడా నికి చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో తొం డాన్ని నేలపై కొడతాయి. లీలావతి కూడా ఇలా చేసినట్టు తెలుస్తోంది. ఆమ్లాల ఉత్పత్తి అధికం కావడంతో కడుపులో ఫర్మెంటేషన్ బ్యాక్టీ రియా చనిపోయి విపరీతంగా గ్యాస్ పుడు తుంది. అలాంటి సమయంలో కూడా కనీసం రెండు గంటలపాటు తీవ్రంగా ఇబ్బంది పడుతుం ది. అప్పటికీ పట్టించుకోకపోతే అకస్మాత్తుగా కిందప డిపోయి ప్రాణాలు విడుస్తుంది. ఇప్పుడు లీల విషయంలో కూడా అదే జరిగిందా? అనే అను మానాలు వినిపిస్తున్నాయి. రాత్రి సుమారు 9 గంటల నుంచి చాలా ఇబ్బంది పడి 11.30 గంటల సమయంలో కింద పడిపో యింది. గంట తర్వాత 12.25 గంటలకు తుదిశ్వాస విడిచింది.సాధారణంగా మనిషికి రోజుకు 10 కి లోల వరకూ గ్యాస్‌వాయువులు ఉత్పత్తి అయి తే..ఏనుగులకు అంతకు పదింతలు అవుతుంది.
ఇలా చేస్తే బతికేదేమో!
ఏనుగు ఒక కేజీ తినేసోడాను ఐదారు లీటర్ల నీటిలో కలిపి పట్టించాలని వైద్యులు చెబుతు న్నారు.తినేసోడా అందుబాటులో లేకపోతే కనీసం ఉప్పు నీళ్లయినా పట్టించాలని అంటున్నారు. అలా చేస్తే జీర్ణ వ్యవస్థ కుదుట పడుతుంది. లీలావతి విషయంలో కూడా ముందుగా దానికి గమనించి తినేసోడా లేదా ఉప్పు నీళ్లు పట్టిస్తే డాక్టరు వచ్చే వరకైనా ప్రాణాలు నిలిచేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మృతిపై విచారణ చేస్తున్నాం..
ఇప్పుడు చనిపోయిన ఏనుగు వయసు 18 ఏళ్లు. ఆశ్రమం మనోభావాలకు అనుగుణంగా నిబం ధనల ప్రకారం ఖననం చేస్తాం. స్టాండర్డ్ ఆప రేటింగ్ ప్రొసీజర్‌ని పాటిస్తాం. మరణానికి కారణాలపై విచారణ మొదలు పెట్టాం. వైద్యుల ప్రాథమిక అంచనా ప్రకారం గుండెపోటుగా భావిస్తున్నాం. పోస్టుమార్టం రిపోర్టు 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం.
- రవీంద్ర ధామా, తూర్పు అటవీ అధికారి
రోజూ బ్రెడ్ పెట్టేవాడిని..
లీల రాగానే రోజూ ఉదయం షాపులోని బ్రెడ్ పెట్టి ఆశీర్వాదం తీసుకునే వాడిని.. బ్రెడ్ తిన్నాక తొండం తలపై పెట్టి ఆశీర్వదించేది. లీలకు ఆహారం పెడితే వ్యాపారం బాగుంటుందనేది నమ్మకం. లీల మరణించిందన్న వార్త బాధ కలిగించింది. - అల్లు నరసింహమూర్తి, స్వీట్స్ షాపు యజమాని
చాలా బాధగా ఉంది..
ఏ పని ప్రారంభించినా లీల ఆశీర్వాదం తప్పనిసరి.. నేను పనిమీద వెడుతున్నాను. శుభం కలగాలని కోరుకునేవాడిని, నా పనులు విజయవంతంగా పూర్తయ్యేవి. ఇప్పుడు లీల మరణించిందని తెలిసి చివరిసారిగా చూసాను.చాలా బాధ అనిపింంది
- మారుతి సాయిచంద్, సీతానగరం
అరటి పండ్లు పెట్టేవాడిని..
నేను రోజూ ఏనుగుకు అరటిపండ్లు పెడితే తిని ఆశీర్వదించేది. లీలకు ఏ రోజైనా పండ్లు పెట్టకపోతే మనశ్శాంతిగా ఉండేది కాదు.దానికి ఆహారం పెట్టి ఆశీర్వాదం తీసుకునేవాళ్లం. ప్రతి రోజూ ఉదయం లీల ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం
- మురకొండ రామకృష్ణ , పండ్ల వ్యాపారి
టిఫిన్ పెడితే తినేది..
లీల (ఏనుగు) అంటే మాకు సెంటిమెంట్. రోజూ ఉదయం షాపు వద్దకు రాగానే మా హోటల్లో చేసిన టిఫిన్స్ తలోరకం పెట్టేవాళ్లం ఆ టిఫిన్ తిని మమ్మల్ని ఆశీర్వదించేది. రోజు దాని రాకకోసం ఎదురుచూసేవాళ్లం .. ఏనుగు రాకపోతే మాకు డల్‌గా ఉండేది. - కుంచే సాయి, హోటల్ యజమాని
Updated Date - Dec 22 , 2024 | 01:33 AM