ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏలేరు, సుద్దగడ్డ వరద తగ్గుముఖం

ABN, Publish Date - Oct 01 , 2024 | 11:53 PM

పిఠాపురం/గొల్లప్రోలు, అక్టోబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపు ప్రభావం తొలగిపోతోంది. కాలువల చెం తన, గండ్లు పడిన ప్రాంతాల్లో ఉన్న పొలాల్లోని నీరు తగ్గింది. ఏలేరు రిజర్వాయర్‌ నుంచి విడుదల చేస్తున్న నీటిని గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలు, క్యా

ఏలేరు కాలువలో తగ్గిన వరద నీటి ప్రవాహం

తొలగిపోతోన్న ముంపు

పిఠాపురం/గొల్లప్రోలు, అక్టోబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ముంపు ప్రభావం తొలగిపోతోంది. కాలువల చెం తన, గండ్లు పడిన ప్రాంతాల్లో ఉన్న పొలాల్లోని నీరు తగ్గింది. ఏలేరు రిజర్వాయర్‌ నుంచి విడుదల చేస్తున్న నీటిని గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాలు, క్యాచ్‌మెంట్‌ ఏరి యా నుంచి 2014 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను 1800 క్యూసెక్కులకు పరిమితం చేశారు. కాలువలకు వేయి క్యూసెక్కుల నీటిని, డీసీఆర్‌ స్లూ యిస్‌ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, విశాఖ తాగునీటి అవసరాలకు 200 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం, గొల్లప్రోలు వద్ద ఏలేరు కాలువలు సాదారణ స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పంటపొలాల్లో ముంపు తగ్గింది. అక్కడక్కడా స్వల్పంగా నీరు నిలిచి ఉంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అవుట్‌ఫ్లోస్‌ను తగ్గించామని ఇరిగేషన్‌ అ ధికారులు తెలిపారు. మరోవైపు సుద్దగడ్డ వరద ఉధృతి తగ్గింది. గొల్లప్రోలు పట్టణ శివారు జగనన్న కాలనీకివెళ్లే రహదారిపై నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:53 PM