ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉచిత ఇసుక సరఫరాకు పకడ్బందీ ప్లాన్‌

ABN, Publish Date - Sep 17 , 2024 | 01:14 AM

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి ప్రణాళి కను సిద్ధంచేసింది. కేవలం ఇసుకతీత, ఎగుమతి, పరిపా లనాపరమైన చార్జీలు, రవాణా చార్జీలతోనే ఇసుకను లబ్ధి దారులకు చేరేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఇసుక తవ్వ కం, లోడింగ్‌ రూ.30, రీలోడింగ్‌కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్‌టీ 18శాతం, డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) రూ.19.68, మెరిట్‌ (ఖనిజాన్వేషన్‌ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు.

రవాణా చార్జీల నిర్ణయం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత ఇసుక పథకాన్ని పకడ్బందీగా అమలుచేయడానికి ప్రణాళి కను సిద్ధంచేసింది. కేవలం ఇసుకతీత, ఎగుమతి, పరిపా లనాపరమైన చార్జీలు, రవాణా చార్జీలతోనే ఇసుకను లబ్ధి దారులకు చేరేలా చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఇసుక తవ్వ కం, లోడింగ్‌ రూ.30, రీలోడింగ్‌కు రూ.30, సీనరేజి రూ. 66, జీఎస్‌టీ 18శాతం, డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) రూ.19.68, మెరిట్‌ (ఖనిజాన్వేషన్‌ నిధి) 2 శాతం వసూ లుచేస్తారు. ఇవికాకుండా లబ్ధిదారుడు రవాణా చార్జీలు పెట్టుకోవాలి. ఇక ర్యాంపుల్లో ఒక పైసా కూడా అదనంగా తీసుకోవడానికి వీలులేదు. కానీ కొందరు రవాణా చార్జీల పేరిట ఎక్కువ వసూలు చేస్తున్నట్టు స్టాక్‌ పాయింట్లలో తేలడంతో రవాణాచార్జీలను ప్రభుత్వమే నిర్ణయిస్తూ జీవో జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే ఇసుక రవాణాచేసే వాహనదారులు ఇసుకను సరఫరా చేయాలి. ఇసుక ర్యాంపు నుంచి 10 కిలోమీటర్ల వరకూ 4.5 టన్నుల ట్రాక్టర్‌కు రూ.13.5 రవాణా చార్జీ నిర్ణయిం చారు. తర్వాత 11 నుంచి 20కిలోమీటర్ల వరకూ రూ.12.8, 21 నుంచి 30 కిలోమీటర్ల వరకూ రూ.12.8, 31నుంచి 40 వరకూ రూ.12.8, 40 నుంచి 80 కిలోమీటర్ల వరకూ రూ. 6.3 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. 10 టన్నుల ఇసు క తీసుకుని వెళ్లే ఆరు టైర్ల ట్రక్కుకు ఇసుక పాయింట్‌ నుంచి 10 కిలోమీటర్ల రూ.10.7, తర్వాత 11 నుంచి 20 కిలోమీటర్ల వరకూ రూ.10.2 తర్వాత 21 నుంచి 30 కిలో మీటర్ల వరకూ 10.2 రూపాయలు, 31 నుంచి 40 వరకూ రూ.10.2, తర్వాత 40 నుంచి 80 కిలోమీటర్ల వరకూ రూ 6.3, వసూలు చేయాలి. 10, 12, 14 టైర్ల లారీలు 18 టన్నులు ఇసుక తీసుకుని వెళ్లినా, 20 టన్నులు, 25 ట న్నులు, 30 టన్నులు, 35 టన్నుల ఇసుక తీసుకుని వెళ్లినా పాయింట్‌ నుంచి 10 కిలోమీటర్ల వరకూ కిలోమీటరు రూ.9.4, తర్వాత 11 నుంచి 20 కిలోమీటర్ల వరకూ రూ. 8.9, 21 నుంచి 30 కిలోమీటర్ల వరకూ రూ.8.9, 31 నుం చి 40 కిలోమీటర్ల వరకూ రూ.8.9, 40 నుంచి 80 కిలో మీటర్ల వరకూ రూ.6.3 వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక 80 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం ఉంటే కిలోమీ టరుకు రూ.35 అదనంగా వసూలు చేయవచ్చని నిర్ణయిం చారు. ఇవన్నీ సక్రమంగా అమలైతే చాలా తక్కువకే ఇసు క వినియోగదారుడికి అందుతుంది. ఇంతవరకూ వరదల వల్ల ఇసుకతీత ఆగింది. నెమ్మదిగా వరద లాగేస్తోంది కాబట్టి త్వరగానే ఇసుకతీత మొదలుకానుంది.

Updated Date - Sep 17 , 2024 | 01:14 AM

Advertising
Advertising