ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గణపతికి ఘన వీడ్కోలు

ABN, Publish Date - Sep 17 , 2024 | 01:12 AM

రాజమహేంద్రవరం సిటీ/కల్చరల్‌, సెప్టెంబరు 16: గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం డివిజన్‌లోని పలు మండపాల్లో పూజలందుకున్న గణపతులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరంలో ఉత్సవ కమిటీలు వారి గణపతుల విగ్రహాలను అ

రాజమహేంద్రి గోదావరిలో నిమజ్జనం అవుతున్న గణనాథుడు

ఊరేగింపులతో గోదావరి చెంతకు

గోదారమ్మ ఒడిలోకి 700 గణనాథులు

ఘనంగా సాగుతున్న గణపతి విగ్రహాల నిమజ్జనం

రాజమహేంద్రవరం సిటీ/కల్చరల్‌, సెప్టెంబరు 16: గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం డివిజన్‌లోని పలు మండపాల్లో పూజలందుకున్న గణపతులకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరంలో ఉత్సవ కమిటీలు వారి గణపతుల విగ్రహాలను అలంకరించిన వాహనాల్లో పురవీధుల గుండా ఊరేగింపుగా గోదావరి బండ్‌ జీవకారుణ్య సంఘం ఎదురుగా ఉన్న ర్యాంప్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు, నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో ర్యాంప్‌లోకి ఒక్కొక్క వాహనాన్ని ఇద్దరు కమిటీ సభ్యులను అనుమతించి క్రేన్‌ సహకారంతో పంటులోకి విగ్రహాలను చేర్చి నది మధ్యలోకి తీసుకెళ్లి గోదావరిలో మునిసిపల్‌ సిబ్బందే నిమజ్జనం చేశారు. దీనిని పెద్దఎత్తున గోదావరి బండ్‌ రోడ్డు పైనుంచి భక్తులు తిలకించి గణపతికి వీడ్కోలు పలికారు. రాజమహేంద్రవరం పరిసర గ్రామాల్లో మొత్తం 1500 విగ్రహాలు భక్తుల పూజలు అందుకున్నాయి. వాటి లో మూడ్రోజులుగా 700 విగ్రహాలు గోదావరి ఒడిలోకి చేరాయి. సోమవారు ఉదయం నుంచి రాత్రి వరకు 80 విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇంకా సుమారు 800 విగ్రహాలు నిమజ్జనం కావాల్సివుంది. మంగళ, బుధవారాల్లో పెద్దఎత్తున గణపతి విగ్రహాల నిమజ్జనం కొనసాగనుం ది. విగ్రహాల నిమజ్జనంలో ఎటువంటి అపశృతులు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నవరాత్రుల ముగింపు సందర్భంగా లడ్డూ వేలం, అన్నదానాలు జరిగాయి. జనసేన నగర ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ పాల్గొని భోజనాలు వడ్డించారు. రాజమహేంద్రవరం పుష్కర్‌ఘాట్‌ వద్ద సృష్టి గణపతి స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి హోమం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 01:12 AM

Advertising
Advertising