కూర్మావతారంలో దర్శనమిచ్చిన వేంకటేశ్వరస్వామి
ABN, Publish Date - Dec 25 , 2024 | 01:16 AM
దశావతార ఉత్సవాలను పురస్కరించుకుని రాయవరం వేంకటేశ్వరస్వామి మంగళవారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
రాయవరం, డిసెంబరు 24(ఆంధ్ర జ్యోతి): దశావతార ఉత్సవాలను పురస్కరించుకుని రాయవరం వేంకటేశ్వరస్వామి మంగళవారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అంగర బాబు, పెద్దింటి కృష్ణమాచార్యులు అర్చకత్వంలో స్వామివారికి పలు రకాల పూలతో అలంకరించారు. అనంతరం అష్టోత్తర, సహస్రనామాలతో తులసిదళ అర్చనలు, నీరాజన మంత్ర పుష్పాలు, మహా నివేదన జరిపారు. కార్యక్రమంలో భక్త సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Updated Date - Dec 25 , 2024 | 01:16 AM