ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుర్కాలు వేసుకుని వచ్చి బంగారం దోచుకుపోయారు

ABN, Publish Date - Dec 23 , 2024 | 01:12 AM

బంగారు వస్తువులు కొనుగోలు చేస్తున్నట్టుగా నటించిన ముగ్గురు మాయలేడీలు జ్యువెలరీ నిర్వాహకుడికి మస్కా కొట్టి 80 గ్రాములు బంగారువస్తువులు అపహరించుకుపోయిన సంఘటన రాజమహేంద్రవరం గుండు వారి వీధిలో ఆదివారం చోటు చేసుకుంది.

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బంగారు వస్తువులు కొనుగోలు చేస్తున్నట్టుగా నటించిన ముగ్గురు మాయలేడీలు జ్యువెలరీ నిర్వాహకుడికి మస్కా కొట్టి 80 గ్రాములు బంగారువస్తువులు అపహరించుకుపోయిన సంఘటన రాజమహేంద్రవరం గుండు వారి వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ పోలీసుల కఽథనం ప్రకారం. రాజమహేంద్రవరం గుండువారిలో ఉన్న వెంకట సాయి జ్యూవెలరీ షాపునకు ఆదివారం గుర్కాలు ధరించిన ముగ్గురు మహిళలు వచ్చారు. తమకు బంగారు ఉంగరాలు ,చెవిదిద్దులు వంటి వస్తువులు కావాలని చెప్పడంతో షాపులో ఉన్న వారు చూపించారు.కొద్ది సేపు చూసిన మహిళలు డిజైన్లు బాగోలేదని వెళ్లి పోయారు. కొంతసేపటి తరువాత షాపులో ఉన్న వ్యక్తికి షోకేసులో ఉన్న బంగారు వస్తువులు తక్కువగా ఉన్నట్లు అనిపించి వాటిని బయటకు తీసి చూశాడు. దీంతో బంగారు వస్తువులు 80 గ్రాముల వరకు తగ్గాయి.సీసీ పుటేజీని పరిశీలిస్తే గుర్కా ముసుగులో వచ్చిన ముగ్గురు మహిళలు గోల్డ్‌ను అపహరించుకుపోయినట్టు గుర్తించారు. షాపు యజమాని శ్రీనితిన్‌ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.సీసీ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 01:12 AM