అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతూ..!
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:11 AM
గొల్లప్రోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్ల క్రితం సర్వశిక్షాభియాన్ నిధులతో నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచ్చులూడిపోతున్నాయి. దీనితో వాటికి తాళాలు వేశారు. మరోవైపు నాడు-నేడు కింద నిర్మించిన తరగతి గదులు అసంపూర్తిగానే ఉన్నాయి. గదులు సరిపడా లేక అందులోనే విద్యాబోధన సాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు రాష్ట్రంలోనే తొలిగా కంప్యూటర్లు ఉన్న హైస్కూ
ఏడేళ్లకే శిథిలావస్థకు చేరిన గదులు
పెచ్చులూడిపోతున్న పైకప్పులు
శ్లాబులకు పగుళ్లు
అందులోనే విద్యాబోధన
గొల్లప్రోలు జిల్లా పరిషత్ బాలుర
ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అగచాట్లు
గొల్లప్రోలు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏడేళ్ల క్రితం సర్వశిక్షాభియాన్ నిధులతో నిర్మించిన తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచ్చులూడిపోతున్నాయి. దీనితో వాటికి తాళాలు వేశారు. మరోవైపు నాడు-నేడు కింద నిర్మించిన తరగతి గదులు అసంపూర్తిగానే ఉన్నాయి. గదులు సరిపడా లేక అందులోనే విద్యాబోధన సాగిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒకప్పుడు రాష్ట్రంలోనే తొలిగా కంప్యూటర్లు ఉన్న హైస్కూలుగా గుర్తింపు పొంది న గొల్లప్రోలు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నేడు అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నది. ప్రస్తుతం పాఠశాలలో 447మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 15మంది ఉపాధ్యాయులు ఉన్నారు. హిందీ విద్యాబోధనకు ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండగా, ఆమె ఇన్‌చార్జి హెచ్ ఎంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
పెచ్చులూడుతూ..
సర్వశిక్షాభియాన్ ద్వారా మంజూరైన నిఽదులతో ఉన్నత పాఠశాల ప్రధాన భవనాల మొదటి అంతస్తులో మూడు తరగతి గదులు నిర్మించారు. వీటి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో అప్పుడే శిథిలావస్థకు చేరుతున్నా యి. తరగతి గదుల పైకప్పు పెచ్చులూడి పడిపోతున్నాయి. శ్లాబులు బీటలు వారాయి. వర్షాల సమయంలో నీరు కారుతుండడం, ఎప్పుడు పైకప్పు పెచ్చులూడి పోతాయననే ఆందోళన నెలకొనడంతో తరగతి గదులకు తాళాలు వేశారు. వరండాలో కొంతకాలం తరగతులు నిర్వహించిన అక్కడా అదే పరిస్థితి కొనసాగడంతో అసంపూ ర్తిగా నిర్మాణంలో ఉన్న భవనంలో తరగతి గదులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతి గదులు కంటే ముందు నిర్మించిన భవనాలు పటిష్టంగా ఉండగా ఇవి మాత్రం పెచ్చులూడి పడిపోవడం నాణ్యతా లోపాలను బహిర్గతం చేస్తున్నది.
ఆసంపూర్తిగా నాడు-నేడు పనులు
నాడు-నేడు కింద వైసీపీ ప్రభుత్వం హయాంలో తొమ్మిది తరగతి గదులు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. అయితే నిధులు మాత్రం ఎనిమిది గదుల నిర్మాణానికి సరిపడా రూ.96లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో 8 తరగతి గదులనే నిర్మించారు. గదుల నిర్మాణం పూర్తయినా ఇంకా అక్కడ సౌకర్యాల కల్పన, రంగులు వేయడం తదితరాలు మిగిలిపోయాయి. వీటి నిర్మాణం రెండున్నర సంవత్సరాలుగా సాగుతూనే ఉంది. హైస్కూలుకు సరిపడా తరగతి గదులు లేని నేపథ్యంలో ఆసంపూర్తిగా ఉన్న వీటినే విద్యాబోధనకు వినియోగిస్తున్నారు.
చిన్న వర్షానికే ఆవరణలోకి నీరు
ఉన్నత పాఠశాలలో పలు అసౌకర్యాలు విద్యార్థులను వెన్నాడుతున్నాయి. మధ్యాహ్న బోజనం చేసేందుకు డైనింగ్‌హాలు లేకపోవడంతో పూర్వ విద్యార్థులు నిర్మించిన స్టేజినే అందుకు వినియోగించుకుంటున్నారు. పాఠశాలలో నీరు పోయే డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే ఆవరణలో నీరు నిలిచిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం సమయంలో మెట్లుపై నుంచి నీరు కిందకు చేరుతున్నది.
సమస్యలు పరిష్కరించాలి
ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఆర్వోప్లాంటును వినియోగంలోకి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం పేషీ అధికారులు ఇప్పటికే ఇక్కడ ఉన్న సమస్యలను గుర్తించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల నాణ్యతను పరీక్షించి మరమ్మతులు చేపట్టడం, నాడు-నేడు కింద చేపట్టిన 8తరగతి గదుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తేవడంపై విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. తాగునీటి సమస్యను పరిష్కరించినట్టే మిగిలిన ఇబ్బందులను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Updated Date - Oct 24 , 2024 | 12:11 AM