ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Governor Haribabu : కొన్ని పరిస్థితులు చూస్తుంటే తెలుగు బలహీన పడిందేమోనన్న భయం కనిపిస్తోంది

ABN, Publish Date - Jan 06 , 2024 | 03:13 PM

కొన్ని పరిస్థితులు చూస్తుంటే తెలుగు బలహీన పడిందేమోనన్న భయం కనిపిస్తోందని మిజోరాం గవర్నర్ డా. హరిబాబు ( Governor Dr. Haribabu ) వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలను జ్యోతి ప్రజ్వలన చేసి గవర్నర్ హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ... కవితలు, కథలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు గజల్స్ వంటి ఎన్నో ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయని గవర్నర్ డా. హరిబాబు చెప్పారు.

రాజమండ్రి: కొన్ని పరిస్థితులు చూస్తుంటే తెలుగు బలహీన పడిందేమోనన్న భయం కనిపిస్తోందని మిజోరాం గవర్నర్ డా. హరిబాబు ( Governor Dr. Haribabu ) వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలను జ్యోతి ప్రజ్వలన చేసి గవర్నర్ హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ... కవితలు, కథలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు గజల్స్ వంటి ఎన్నో ప్రక్రియలు తెలుగు భాషలో ఉన్నాయని చెప్పారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి మహనీయుల కీర్తనలు , పింగళి, ఆరుద్ర , త్రిపురనేని, వంటి కవుల రచనలు తెలుగు భాషకు వన్నె తెచ్చాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, కందుకూరి , మధునాపంతుల, శ్రీపాద, బోయి భీమన్న వంటి మహనీయులు తెలుగుజాతిలో చిరస్మరణీయులు అని కొనియాడారు. కొన్ని పరిస్థితుల వల్ల యువత తెలుగు నేర్చుకోవడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతుందని గవర్నర్ డా. హరిబాబు పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 06 , 2024 | 03:13 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising