ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోజంతా వర్షమే!

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:34 PM

పిఠాపురం, ఆగస్టు 30: రోజంతా వర్షమే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పా

పిఠాపురంలో కురుస్తున్న వర్షం

రహదారులన్నీ జలమయం

పౌర జీవనానికి తీవ్ర అంతరాయం

పిఠాపురం, ఆగస్టు 30: రోజంతా వర్షమే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు మండలాల పరిధిలో గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ వర్షం కురుస్తూనే ఉంది. విరామం లేకుండా వర్షం పడుతుండడంతో పట్టణాల్లో ప్రధాన రహదారులపై నీరు ప్రవహించింది. ఎక్కడిక్కడ డ్రెయిన్లు పొంగిపొర్లాయి. రోడ్లపై జనసంచారం తగ్గిపోయింది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వర్షంలో తడిచి ముద్దయ్యారు. పిఠాపురంలో పలు పాఠశాలల ఆవ రణలోకి వర్షపునీరు చేరింది. వర్షాలు మరో 2రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైతులు, ప్రజలు కలవరానికి గురవుతున్నారు.

ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసి పౌర జీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. రహదారులు, పల్లపు ప్రాంతాలు చిత్తడిచిత్తడిగా మారాయి. ఈ వర్షాల వల్ల మెట్ట ప్రాంతంలోని వరి, చెరుకు, కూరగాయల పంటలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆనందం వ్య క్తం చేశారు. సాగునీటి జలాశయాలు, చెరువులకు పెద్ద ఎత్తున వర్షం నీరు చేరుతుంది.

కొత్తపల్లి: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభా వంతో మండలంలో ఉదయం నుంచీ సాయంత్రం వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి. ఏమాత్రం తడిసినా జలుబు, తలనొప్పి, జ్వరం వంటి ఇబ్బందు లు వస్తాయని ప్రజలు ప్రజలు ఇంటి పట్టునే ఉం టున్నారు. రోజంతా ముసురుగా ఉండంతో తీరప్రాంతాల మత్స్యకారులు వేటను విరమించారు.

కిర్లంపూడి: మండల గ్రామాల్లో చిరుజల్లులు కురిశాయి. వర్షాలకు సింహాద్రిపురం, వేలంక, రాజుపాలెం, వీరవరం రహదారులు అధ్వానంగా మార డంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

కరప: మండలవ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి నిర్విరామంగా వర్షం పడుతూనే ఉం ది. చినుకులు, మధ్య మధ్యలో ఒక మోస్తరు వర్షం కురవడంతో జనం ఇళ్లలోంచి బయటకు రాలేదు. ఈ వర్షంతో వరిచేలకు మేలు చేకూరుతుందని రైతులు చెబుతున్నారు. ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి రోజు కూలీలు పనుల్లేక ఇళ్లకే పరిమితమయ్యారు.

తుని రూరల్‌: ఖరీఫ్‌ పంటలు ఊపందుకుంటున్న తరుణంలో కురుస్తున్న వర్షాలతో మండలం లో ఎక్కడికక్కడే పనులకు ఆటంకం ఏర్పడింది. వరి మడులతోపాటు, పత్తి చేలల్లో నీరు చేరాయి. ఎగువు న కురుస్తున్న వర్షాలకు తాండవ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండల గ్రామాల్లో సాగునీటి చెరువులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి.

తొండంగి: అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ముసురు వాతావరణం ఏర్ప డింది. ఇప్పటికే నాట్లు వేసిన మెట్ట పొలాలకు ఈ వర్షం మేలు చేకూరుస్తుందని రైతులు భావిస్తున్నా రు. ఏ.కొత్తపల్లి, గోపాలపట్నం, చిన్నయ్యపాలెం తదితర గ్రామాల్లోని మెట్ట భూముల్లో ఇంకా వరినాట్లు కొనసాగుతుండడంతో ప్రస్తుత వర్షం నాట్లు మూనకట్టేందుకు ఉపయోగ పడుతుందంటున్నారు.

జగ్గంపేట: జగ్గంపేటలో శుక్రవారం తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. నిత్య శ్రామికులు, కూలీలు, ఇండ్లకే పరిమితమయ్యారు. ఎండ, వాన వాతావరణాల వల్ల సీజన్‌ వ్యాధులు ప్రబలుతుండటంతో అనేక మంది జ్వరాల బారిన పడుతున్నారు. కమ్యూనిట హెల్త్‌ సెంటర్‌ క్యాంపులు నిర్వహించి రోగులకు మందులు అంది ంచే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 30 , 2024 | 11:34 PM

Advertising
Advertising