ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైవేల విస్తరణ, అభివృద్ధి పనులపై సమీక్ష

ABN, Publish Date - Oct 04 , 2024 | 12:20 AM

జాతీయ రహదారి-216 విస్తరణ అభివృద్ధి పనులపై వస్తున్న అభ్యంతరాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పాశర్లపూడి, మామిడికుదురులలో వచ్చిన అభ్యంతరాలపై ఆయన కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో సమీక్షించారు. విస్తరణ పనులకు అడ్డంకిగా ఉన్న భవన నిర్మాణాల విలువల గణనలో వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయేమో పునఃపరిశీలన చేసి తాజాగా నివేదిక అందించాలని ఆదేశించారు.

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

అమలాపురం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి-216 విస్తరణ అభివృద్ధి పనులపై వస్తున్న అభ్యంతరాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పాశర్లపూడి, మామిడికుదురులలో వచ్చిన అభ్యంతరాలపై ఆయన కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో సమీక్షించారు. విస్తరణ పనులకు అడ్డంకిగా ఉన్న భవన నిర్మాణాల విలువల గణనలో వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయేమో పునఃపరిశీలన చేసి తాజాగా నివేదిక అందించాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, భూసేకరణ అధికారులు 2016 సంవత్సరంలో పాసైన అవార్డులకు, 2019లో పాసైన అవార్డులకు భూముల నష్టపరిహారం చెల్లింపులో వ్యత్యాసాలను, ఇల్లు, భూములు కోల్పోయిన నిర్వాసితుల కోరిక మేరకు గణించాలన్నారు. గెద్దాడలో రహదారి విస్తరణ పనులకు సంబంధించి బరియల్‌ గ్రౌండ్‌ స్థానే వేరే స్థలాన్ని కేటాయించి బరియల్‌ గ్రౌండ్‌ నిర్మించాలని ఆదేశించారు. శివకోడులో జలవనరుల శాఖ లాకు దెబ్బతినే అవకాశాలపై మరోసారి స్వయంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 5న ఆర్‌అండ్‌బీ కార్యదర్శి సమావేశానికి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి, ఆర్డీవో కె.మాధవి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.రాము, జలవనరులశాఖ ఈఈ బి.శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 12:20 AM