YCP: వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు
ABN, Publish Date - Mar 09 , 2024 | 12:21 PM
కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు ఎదురవుతున్నాయి. అనురాధను సంగతి తేల్చకుండానే అమలాపురం ఎంపీ టికెట్ రాత్రికి రాత్రి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం కేటాయించింది. తన పరిస్థితి ఏంటో అర్థం కాక అనురాధ తల పట్టుకుంటున్నారు.
కోనసీమ: కోనసీమ (Konaseema) జిల్లా అమలాపురం (Amalapuram) వైసీపీ (YCP) ఎంపీ చింతా అనురాధ (Chinta Anuradha)కు అవమానాల మీద అవమానాలు ఎదురవుతున్నాయి. అనురాధను సంగతి తేల్చకుండానే అమలాపురం ఎంపీ టికెట్ రాత్రికి రాత్రి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad)కు వైసీపీ అధిష్టానం కేటాయించింది. తన పరిస్థితి ఏంటో అర్థం కాక అనురాధ తల పట్టుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం తీరుపై అనురాధ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ సభలో అమలాపురం ఎంపీ టికెట్ తనదేనని రాపాక ప్రకటించారు. ఆ తర్వాత అమలాపురంలో ఓ కార్యక్రమంలో మైక్ ఇవ్వకుండా మంత్రి విశ్వరూప్ (Minister Viswaroop) అవమానించారు.
Dhulipalla: జగన్ ఇచ్చేది రూపాయి.. దోచుకునేది పది రూపాయలు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 09 , 2024 | 12:22 PM