ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం’

ABN, Publish Date - Oct 05 , 2024 | 12:19 AM

పిఠాపురం, అక్టోబరు 4: పట్టణంలోని ది పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(పూర్వ అర్బన్‌ బ్యాం కు)కి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్య ర్థులను గెలిపించుకుందామని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చా

పిఠాపురంలో కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, చిత్రంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు

పిఠాపురం, అక్టోబరు 4: పట్టణంలోని ది పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(పూర్వ అర్బన్‌ బ్యాం కు)కి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్య ర్థులను గెలిపించుకుందామని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు సూచించారు. పట్టణంలోని మున్సిపల్‌ కల్యాణమ ండపంలో శుక్రవారం వారు మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీల రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఇరుపార్టీల నేతలు కలిసి చర్చించి ఎన్‌డీఏ తరపున 5 వార్డుల్లో డైరెక్టరు పదవులకు అభ్యర్థులను పోటీలో నిలిపామని తెలిపారు. 1వ వార్డు నుంచి విళ్ల వీరవెంకట నాగేశ్వరరావు, 2 నుంచి చెల్లుబోయిన ప్రమీల, 3 నుంచి అద్దంకి వెంకటరమణ, 4 నుంచి అరిగెల ప్రసాదరావు, 5వ వార్డు నుంచి మేళం రామకృష్ణను బలపరుస్తున్నట్లు చెప్పారు. 1,3 వా ర్డుల్లో టీడీపీ తరపున, 2,4,5వార్డుల్లో జనసేన తరపు అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. చైర్మన్‌ పదవి జనసేనకు, వైస్‌చైర్మన్‌ పదవి టీడీపీకి కేటాయించినట్లు తెలిపారు. అంతకుముందుకు జనసేన నేతలు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పిఠాపురం మాజీ ఎమ్మె ల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మల మధ్య ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చలు జరిగాయి. సమావేశంలో కూటమి బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 12:19 AM