ఒత్తిడిని దూరం చేసేందుకే క్రీడా పోటీలు
ABN, Publish Date - Dec 17 , 2024 | 12:47 AM
సర్పవరం జంక్షన్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో దేహదారుఢ్యం.. మానసికోల్లాసం లభిస్తుందని ఏపీఎస్పీ కమాండెంట్, ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక అన్నారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ప్రాంగణంలో సోమవారం యాన్సువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో బెటాలియన్ పోలీసులు బిజీగా ఉంటారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తుంటారన్నారు. ఒ
ఏపీఎస్పీ కమాండెంట్ ఎం.దీపిక
ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ప్రాంగణంలో
స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024 ప్రారంభం
సర్పవరం జంక్షన్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో దేహదారుఢ్యం.. మానసికోల్లాసం లభిస్తుందని ఏపీఎస్పీ కమాండెంట్, ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక అన్నారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ప్రాంగణంలో సోమవారం యాన్సువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో బెటాలియన్ పోలీసులు బిజీగా ఉంటారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తుంటారన్నారు. ఒత్తిడిని దూరం చేసేందుకు ఏటా బెటాలియన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహిస్తూ సిబ్బంది, అధికారుల్లో నూతనోత్సాహం నింపడం జరుగుతుందన్నారు. ప్రతీ రోజూ వ్యాయామం చేస్తున్నా క్రీడలు ఆడటం వల్ల ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటా మన్నారు. పోలీసుశాఖలో ఫిజికల్ ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యమన్నారు. ముందుగా బెటాలియన్‌లో ఉన్న 7కంపెనీల స్పోర్ట్స్ సిబ్బంది మార్చి ఫాస్ట్ నిర్వహించగా సిబ్బంది నుంచి కమాండెంట్ గౌరవ వందనం స్వీకరించి, గాల్లోకి బెలూన్స్ విడిచిపెట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్, రన్నింగ్, లాంగ్ జంప్ పోటీల్లో సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. కార్యక్రమంలో ఐపీఎస్ అధికారిణి ఆర్.సుస్మిత, అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్లు డి.మురళీకుమార్, ఎం.మోహన్‌రావు, బిఎస్.చంద్రశేఖరరావు, ఎస్.మన్మథరావు, యూని ట్ మెడికల్ ఆఫీసర్లు సునీల్, లక్ష్మి, ఆర్‌ఐలు కె.రవిశంకర్, బి.విఠలేశ్వరరావు, ప్రసాద్, యూనిట్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2024 | 12:47 AM