ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట

ABN, Publish Date - Oct 26 , 2024 | 11:52 PM

కాకినాడ సిటీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ పెద్ద పీట వేస్తుందని, ఆపదలో ఉన్న కార్యకర్తల కుటు ంబాలను ఆదుకోవడమే టీడీపీ సభ్యత్వ నమోదు లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 6వ డివిజన్‌ రేచెర్లపేట, 30వ డివి

సెల్‌ఫోన్‌లో సభ్యత్వం చూపుతున్న కొండబాబు

కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు

కాకినాడ సిటీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ పెద్ద పీట వేస్తుందని, ఆపదలో ఉన్న కార్యకర్తల కుటు ంబాలను ఆదుకోవడమే టీడీపీ సభ్యత్వ నమోదు లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక 6వ డివిజన్‌ రేచెర్లపేట, 30వ డివిజన్‌ గోల్డ్‌ మార్కెట్‌ సెంటర్‌ ఏరియాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీకి ఎప్పుడూ కార్యకర్తలే బలమన్నారు. ఏదైనా ప్రమాదంలో మరణించినప్పుడు ఆదుకోవడానికి సభ్యత్వ నమో దు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పార్టీ సభ్య త్వాన్ని వాట్సాప్‌, టీడీపీ యాప్‌, టెలిగ్రామ్‌ ద్వారా రూ.100 చెల్లించి పొందవచ్చన్నారు. ప్రతి కార్య కర్త సభ్యత్వం చేయించుకోవాలని, ఇప్పటికే ఉన్న వారు పునరుద్ధరించుకోవాలన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, గ్రంథి బాబ్జి, బచ్చు శేఖర్‌, పోలిపల్లి జగన్‌, గదుల సాయిబా బు, ఏంఏ తాజుద్దీన్‌, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ, గుత్తుల రమణ, అంబటి చిన్న, అమన్‌ జైన్‌, బొబ్బిలి గోవిందు, దంగేటి సతీష్‌, బుంగా నాగరాజు, గంజి గోపి, అద్దేపల్లి గంగరాజు, ఎండీ అన్సర్‌, రెడ్నం సత్తిబాబు అమలకంబి బలరామ్‌, కొల్లు కుమారి, బత్తిన ఉమాదేవి పాల్గొన్నారు. వసంతాల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని టీడీపీ జిల్లా మీడియా కోఆర్డినేటర్‌ వుండవల్లి వీర్రాజు అన్నారు. శనివా రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణలా ఉందన్నారు. నమోదును మొబైల్‌ ఫోన్‌, కంప్యూటర్‌ నుంచి వాట్సాప్‌, టెలిగ్రామ్‌ ద్వారా వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవచ్చ ని, పాత సభ్యత్వాన్ని రెన్యువల్‌ చేసుకోవచ్చన్నారు.

టీడీపీ సభ్యత్వంతో భరోసా

టీడీపీ సభ్యత్వంతో ప్రతీ కార్యకర్త కుటుంబా నికి భరోసా లభిస్తుందని మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, కాకినాడ రూరల్‌ ఎన్నికల సమ న్వయకర్త నులుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం నులుకుర్తి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహించా రు. చిక్కాల, నులుకుర్తి మాట్లాడుతూ రూ.100 సభ్యత్వ రుసుంతో కార్యకర్తతోపాటు వారి కుటుం బానికి భరోసా భద్రత ఉంటుందన్నారు. క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, డివిజన్‌ స్థాయిలో సభ్యత్వ నమోదును అత్యధికంగా చేపట్టాలన్నారు. పార్టీలో పదవుల కేటాయింపు, ఇతర అంశాల్లో ప్రాధాన్యం ఉండాలంటే సభ్యత్వం తప్పనిసరన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు దేవు వెంకటేశ్వరరావు, మాసుమేను గంగయ్య, దమ్ము నూకరాజు, కోణా ల కృష్ణ, ముగ్గుళ్ల బాబూరావు, కొండా వినాయక్‌, మల్లంపల్లి నారాయణ, డి.సత్తిబాబు ఉన్నారు.

Updated Date - Oct 26 , 2024 | 11:52 PM