పరిశ్రమల్లో తప్పనిసరిగా సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Sep 03 , 2024 | 01:14 AM
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబర్2: ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రమాదకర పరిశ్రమల్లో తప్పనిసరిగా అలారం, సెన్సార్ వ్యవస్థను అమర్చాలని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌తో కలిసి జిల్లాలోని పరిశ్రమల భద్రతపై జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్‌మో
జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్
కలెక్టరేట్(కాకినాడ), సెప్టెంబర్2: ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రమాదకర పరిశ్రమల్లో తప్పనిసరిగా అలారం, సెన్సార్ వ్యవస్థను అమర్చాలని జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌తో కలిసి జిల్లాలోని పరిశ్రమల భద్రతపై జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ఎన్టీఆర్ అనకాపల్లి జిల్లాల పరిశ్రమల్లో చోటుచేసు కున్న ప్రమాద సంఘటనల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో జూలై నెల నుంచి ప్రమాదకర పరిశ్రమల్లో వివిధ శాఖల అధికారులతో ఉమ్మడి వరుసగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధానంగా 14 ప్రమాదకర పరిశ్రమలను గుర్తించినట్టు తెలిపారు. చాలా పరిశ్రమల్లో మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రమాదకర పరిశ్రమల్లో అలారం, సెన్సార్ వ్యవస్థను అక్టోబర్ 15 నాటికి అమర్చాలన్నారు. ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా తనిఖీలకు సంబంధించిన ఆడిట్ ఇతర వివరాలను సమర్పించాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుతీరు, ప్రమాదకర రసాయనాలు తయారీ, నిల్వల వివరాలు, ప్రమాద సంఘట నలు చోటుచేసుకునే సందర్భాల్లో పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొం టున్న ఇబ్బందులను సమీక్షించారు. ఈ కార్యక్ర మంలో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సందీప్, ఏపీఐఐసీ జెడ్‌ఎం రమణారెడ్డి, డీఐసీ కృష్ణార్జునరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాణి, ఇన్‌చార్జి అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బారావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 03 , 2024 | 01:14 AM