ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బడిఈడు పిల్లలు బడి బయట ఉండరాదు

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:25 AM

సామర్లకోట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బడిఈడు పిల్లలు బడిబయట ఉండరాదనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సామర్లకోట శివారు తమ్మిరాజు చెరువు సమీపాన లేఅవుట్‌ ఖాళీ ప్రదేశంలో సంచార బాలల కోసం తాత్కాలిక పాఠశాలను ఏర్పాటుచేశామని జిల్లా విద్యాశాఖా ధికారి పి.రమేష్‌ తెలిపారు. సామర్లకోట ఎంఈ

పిల్లలతో మాట్లాడుతున్న డీఈవో, ఎంఈవోలు

డీఈవో రమేష్‌

సామర్లకోట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బడిఈడు పిల్లలు బడిబయట ఉండరాదనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సామర్లకోట శివారు తమ్మిరాజు చెరువు సమీపాన లేఅవుట్‌ ఖాళీ ప్రదేశంలో సంచార బాలల కోసం తాత్కాలిక పాఠశాలను ఏర్పాటుచేశామని జిల్లా విద్యాశాఖా ధికారి పి.రమేష్‌ తెలిపారు. సామర్లకోట ఎంఈ వోలు వై.శివరామకృష్ణయ్య, పి.పుల్లయ్య ఆధ్వర్యం లో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన పాఠ శాల తరగతులను గుడారాలలోనే డీఈవో ప్రార ంభించారు. ఈ తాత్కాలిక పాఠశాలను నాన్‌ రెసిడెన్షియల్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ అంటా రన్నారు. ఇక్కడ తాత్కాలికంగా గుడారాలు ఏర్పా టుచేసుకుని జీవనం సాగిస్తున్న వారి చిన్నారులు 21 మందిని ప్రాథమికంగా గుర్తించి జిల్లా సమగ్రశిక్షా ఆధ్వర్యంలో ఈ పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ విద్యాకేంద్రంలో ఉచిత విద్యతో పాటు ప్రభుత్వం అందించే పుస్త కాలు, యూనీఫాం దుస్తులు, మధ్యాహ్నభోజన పధకం అందజేస్తామన్నారు. అనంతరం చిన్నా రులకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధి కారి సీహెచ్‌.వెంకట్రాజు, చైల్డ్‌ లైన్‌ కో-ఆర్డినేటర్‌ బి. శ్రీనివాస్‌, కె.హరికృష్ణ, ప్రవీణ్‌, ప్రధానోపాధ్యా యులు నాగేశ్వరరావు, సూర్యనారాయణ పాలొ ్గన్నారు. సామర్లకోటలోని నిమ్మతోట వద్ద గల ప్రతిభ విద్యాసంస్థను డీఈవో రమేష్‌ సందర్శిం చి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

Updated Date - Oct 20 , 2024 | 12:25 AM