ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులు ధైర్యంగా ప్రతిసవాళ్లను ఎదుర్కోవాలి

ABN, Publish Date - Sep 14 , 2024 | 12:30 AM

జేఎన్టీయూకే, సెప్టెంబరు 13: విద్యార్థులు దైర్యంగా ప్రతిసవాళ్లను ఎదుర్కోవాలని జేఎన్టీయూకే ఇన్‌చార్జి ఉపకులపతి కేవీఎస్‌జీ.మురళీకృష్ణ అన్నారు. వర్శిటీలోని సెనేట్‌ హాల్లో ఐఐఎఫ్‌టీ కాకినాడ ఐపీఎం 2024-29 బ్యాచ్‌ కోసం నిర్వహించిన ఓరియంటేషన్‌ వారం ముగింపు వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది.

జేఎన్టీయూకే వీసీ మురళీకృష్ణ

జేఎన్టీయూకే, సెప్టెంబరు 13: విద్యార్థులు దైర్యంగా ప్రతిసవాళ్లను ఎదుర్కోవాలని జేఎన్టీయూకే ఇన్‌చార్జి ఉపకులపతి కేవీఎస్‌జీ.మురళీకృష్ణ అన్నారు. వర్శిటీలోని సెనేట్‌ హాల్లో ఐఐఎఫ్‌టీ కాకినాడ ఐపీఎం 2024-29 బ్యాచ్‌ కోసం నిర్వహించిన ఓరియంటేషన్‌ వారం ముగింపు వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. అతిథులు జ్యోతి ప్రజ్వలనచేసి కార్యక్రమాన్ని పారంభించగా ఇండియన్‌ ఇనిస్టట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ట్రేడ్‌ ( ఐఐ ఎఫ్‌టీ) కాకినాడ సెంటర్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ వి.రవీంద్ర సారధి విద్యార్థులకు ఉండాల్సిన నాయకత్వ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ విద్యార్థులు నేటి వేగవంతమైన ప్రపంచంలో అప్‌డేట్‌గా ఉండాలన్నారు. ఓఎన్‌జీసీ ఈడీ రత్నేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఐఐఎఫ్‌టీని ఆధునికకాలపు గురుకులంగా పేర్నొన్నారు. అరోరా లైఫ్‌సైన్సెస్‌ సీఈవో రాజేంద్రరావు మాట్లాడుతూ ఇంటర్న్‌ షిప్‌లద్వారా విద్యార్థులు సిద్దాంత జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. ఐఐఎఫ్‌టీ ఉపకులపతి ప్రొఫెసర్‌ రాకేష్‌ మోహన్‌ జోషి మాట్లాడుతూ ఐఐఎఫ్‌టీ విద్యార్థుల విభిన్న నేపధ్యాలను, భావాలను ప్రస్తావించారు. కార్యక్రమంలో ఓఎస్డీ బాబూరావు నాయుడు, డాక్టర్‌ రష్మీరస్తోగి, పీఎం చార్యులు, ఐఐఎఫ్‌టీ అధ్యాపకులు, ఐపీఎం విద్యార్థులు ఉన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 12:30 AM

Advertising
Advertising