జనవాణిలో వినతులు స్వీకరించిన ఎంపీ, ఎమ్మెల్యే
ABN, Publish Date - Sep 19 , 2024 | 12:06 AM
సర్పవరం జంక్షన్/కార్పొరేషన్, సెప్టెంబరు 18: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. వివిధ సమస్యలు ప
సర్పవరం జంక్షన్/కార్పొరేషన్, సెప్టెంబరు 18: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. వివిధ సమస్యలు పరిష్కారం కోరుతూ అర్జీలతో వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధింత శాఖల అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారం చేయాలని సూచించారు. నెలలో ఒకరోజు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు జనవాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు నానాజీ తెలిపారు.
Updated Date - Sep 19 , 2024 | 12:06 AM