‘ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా చర్యలు’
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:02 AM
కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 19: ఎన్నికల్లో ఓటర్లను మద్యం, నగదు, ఇతర తాయి లాలతో ప్రలోభాలకు గురి చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ లోక్‌సభ వ్యయ పరిశీలకులు సాద్దిక్ అహ్మద్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో ఆయన ఇతర పరిశీలకులతో కలిసి సమావేశం

కలెక్టరేట్ (కాకినాడ), ఏప్రిల్ 19: ఎన్నికల్లో ఓటర్లను మద్యం, నగదు, ఇతర తాయి లాలతో ప్రలోభాలకు గురి చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కాకినాడ లోక్‌సభ వ్యయ పరిశీలకులు సాద్దిక్ అహ్మద్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో ఆయన ఇతర పరిశీలకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల్లో అనుమానస్పదంగా జరిగే లావాదేవీలు, బదిలీలపై దృష్టి సారించాలన్నారు. మద్యం అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకోవాల న్నారు. చెక్‌పోస్ట్‌ల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో శాసనసభ నియోజకవర్గాల పరిశీలకులు యోగేష్‌కుమార్, ఆశిఫ్, అదనపు ఎస్పీ భాస్కర్‌రావు, డీటీసీ మోహన్, లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు.