మహిళా దినోత్సవం రోజున మెడపై నరికేశాడు!
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:47 AM
ముమ్మిడివరం, మార్చి 8 (ఆం ధ్రజ్యోతి): మహిళా దినోత్సవం రోజున ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి మెడపై నరికిన సంఘటన ముమ్మిడివరం మండలం అనాతవరంలో జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం ఎదురుమూడి పుంతలో పంతగంటి

యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు
ముమ్మిడివరం, మార్చి 8 (ఆం ధ్రజ్యోతి): మహిళా దినోత్సవం రోజున ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి మెడపై నరికిన సంఘటన ముమ్మిడివరం మండలం అనాతవరంలో జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం ఎదురుమూడి పుంతలో పంతగంటి జయరామకృష్ణ, చాట్ల మాలతి పక్కపక్కన ఇళ్లల్లో ఉంటున్నారు. జయరామకృష్ణ వివాహితుడు కాగా భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటుంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మాలతి కూడా వివాహిత. భర్త బుల్లియ్య ఉపాధి నిమిత్తం ఏలూరులో చెరువుల వద్ద ఉంటున్నాడు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే శనివారం మధ్యాహ్నం మాలతి ఇంటి నుంచి బయటికి వెళ్తున్న సమయంలో చుట్టుపక్కల పిల్లలంతా ఆడుకుంటూ అల్లరి చేస్తుండగా వారిని ఆమె గట్టిగా మందలించింది. ఆ సమయంలో జయరామకృష్ణ ఇంట్లో నుంచి కత్తితో వచ్చి ఆమె మెడపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అపస్మారక స్థితికి వెళ్లడంతో మాలతిని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే గతంలో ఇరుగుపొరుగువారు ఎవరు గొడవ పడినా జయరామకృష్ణకు కిట్టేది కాదని, గట్టిగా మాట్లాడుకున్నా, గొడవపడినా ప్రశాంతంగా ఉండాలని వారిని హెచ్చరించేవాడని, ఈ క్రమ ంలోనే అల్లరిచేస్తున్న పిల్లలను మందలిస్తున్న మాలతిపై ఉద్రేకంతో కత్తితో మెడపై దాడి చేశాడని పోలీసులు పేర్కొంటున్నారు. సీఐ ఎం.మోహన్‌కుమార్, ఎస్‌ఐ డి.జ్వాలాసాగర్ సంఘటనా స్థలానికి వెళ్లి ఇరుగుపొరుగువారిని విచారించి ఆధారాలు సేకరించారు. క్లూస్‌టీమును రప్పించి ఆధారాలు సేకరించారు. నిందితుడు జయరామకృష్ణను అదుపులోకి తీసుకుని దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మోహన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాలతి ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతుంది.